Last Updated:

BRS : బీఆర్ఎస్ గూటికి తోట చంద్రశేఖర్, రావెల కిషోర్ బాబు… పెద్ద స్కెచ్ వేసిన కేసీఆర్?

BRS : దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు కేసీఆర్ సిద్దం అవుతున్నారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ నిర్ణయం తీసుకున్న కేసీఆర్... ఇటీవలే

BRS : బీఆర్ఎస్ గూటికి తోట చంద్రశేఖర్, రావెల కిషోర్ బాబు… పెద్ద స్కెచ్ వేసిన కేసీఆర్?

BRS : దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు కేసీఆర్ సిద్దం అవుతున్నారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ నిర్ణయం తీసుకున్న కేసీఆర్… ఇటీవలే డిల్లీలో పార్టీ కేంద్ర కార్యాలయాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. ఇక ఈ తరుణంలోనే ఇతర రాష్ట్రాలలో కూడా బీఆర్ఎస్ ను విస్తరించేందుకు రెడీ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు నేతలు నేడు బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. వీరిలో ముఖ్యంగా… మాజీ ఐఏఎస్ అధికారి, జనసేన నేత తోట చంద్రశేఖర్‌, మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు, మాజీ ఐఆర్ఎస్ అధికారి పార్థసారథి, టీజే ప్రకాశ్‌తో పాటు పలువురు నేతలు పార్టీలో చేరనున్నాట్లు సమాచారం అందుతుంది. ఈరోజు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌ లో వీరంతా కేసీఆర్ సమక్షంలో పార్టీ తీర్దం పుచ్చుకొనున్నారు.

తోట చంద్రశేఖర్ మహారాష్ట్ర కేడర్ ఐఏఎస్‌గా 23 ఏళ్ల పాటు పనిచేసి 2009లో పదవికి రాజీనామా చేశారు. కాగా 2009 లో ప్రజారాజ్యం పార్టీ తరపున గుంటూరు లోక్‌సభ స్థానానికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2014 లో వైసీపీ అభ్యర్థిగా ఏలూరు లోక్‌సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2019లో జనసేన తరుపున గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు.

రావెల కిశోర్‌‌బాబు 2014 ఎన్నికల్లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా గెలిచి చంద్రబాబు మంత్రివర్గంలో సాంఘిక సంక్షేమ మంత్రిగా పనిచేశారు. 201 9లో జనసేనలో చేరి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత బీజేపీలో చేరి కొంతకాలానికే ఆ పార్టీకి కూడా రాజీనామా చేశారు.

చింతల పార్థసారథి 2019లో అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగి పరాజయం పాలయ్యారు.

తుమ్మలశెట్టి జయప్రకాశ్ నారాయణ (టీజే ప్రకాశ్) 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరపున అనంతపురం నగర నియోజకవర్గంలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

ఏపీలో ప్రస్తుతం త్రిముఖ పోటీ నడుస్తుండగా వీరితో పాటు కేసీఆర్ కూడా ప్రజాదరణ కూడా గట్టుకోవడం కష్టం అని చెప్పాలి. తెలంగాణలో కేసీఆర్ కు మంచి మద్దతు ఉన్నప్పటికీ… ఏపీలో మాత్రం కష్టం. ఇక ఏపీలో ఈ మూడు పార్టీలను కాకుండా ప్రజాదరణ లేని బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపడం పట్ల అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన తోట చంద్రశేఖర్ కు ఏపీ బీఆర్ఎస్ పగ్గాలు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలో కాపు సామాజిక వర్గం ఓట్లు ప్రాముఖ్యం సంతరించుకున్నాయి. ఈసారి ఎలాగైనా కాపు సామాజిక వర్గానికి చెందిన వారిని సీఎం గా చేయాలని… ఆ సామాజిక వర్గానికి చెందిన పలు పార్టీ నేతలు, కార్యకర్తలు కోరుతున్నారు. దీంతో జనసేనకు ప్రధాన బలమైన కాపు సామాజిక వర్గ ఓటర్లను బీఆర్ఎస్ చీల్చే అవకాశం ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: