Home / Pawan Kalyan
రాష్ట్రంలోని 13మంది వైసీపీ ప్రజా ప్రతినిధులపై జనసేన పార్టీ శ్రేణులు దాడులు చేసే అవకాశం ఉందంటూ పోలీసు ఇంటిలిజెన్స్ నివేదికపై అధికార పార్టీ కుట్రలు తిప్పి కొట్టాలని జనసేన పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు పార్టీ కార్యకర్తలకు జనసేన నేత నాదెండ్ల మనోహర్ అప్రమత్తం చేశారు.
36 విదేశీ వాణిజ్య ఉపగ్రహాలను అలోవకగా అంతరిక్ష్యంలోకి ప్రవేశపెట్టిన జీఎస్ఎల్వీ మార్క్ 3 రాకెట్ విజయం చారిత్రాత్మికమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఏపీలోని మహిళా కమీషన్ బాధ్యతలు ఎంతమేరకు నిర్వహిస్తున్నారో ఆ పార్టీ గుర్తు చేసింది. ఓ పార్టీకి కొమ్ముకాసేలా రాష్ట్ర మహిళా కమీషన్ వ్యవహారిస్తున్న తీరును సోషల్ మీడియా వేదికగా జనసేన పార్టీ ఎండగట్టింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఇష్టం ఉన్నవాళ్లు మూడు పెళ్లిళ్లు చేసుకోవాలన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయింది.
సీఎంను అర్జంటుగా ఈఎన్టీ స్పెషలిస్ట్ వైద్యుడికి చూపించాలని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై జగన్ విమర్శలు చేసిన క్రమంలో ఆ పార్టీ శ్రేణులో రగిలిపోతున్నారు. జగన్మోహన రెడ్డి అవనిగడ్డలో ఇష్టమొచ్చిన్నట్లు మాట్లాడరని మండిపడ్డారు.
పవన్ వ్యాఖ్యలకు అవనిగడ్డ వేదికగా సీఎం జగన్ కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. ఏం చేయలేనివాళ్లు బూతులు తిడుతున్నారని, చెప్పులు చూపిస్తూ దారుణమైన మాటలు మాట్లాడుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. వీధి రౌడీలు కూడా ఇలా మాట్లాడరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు చంద్రబాబు, పవన్ కలయిక పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్‌ను చంద్రబాబు కలవడాన్ని స్వాగతిస్తున్నానన్నారు.
ఎలాగైనా ఆంధ్రప్రదేశ్ సీఎం సీటులో కూర్చోవాల్సిందే. ఇది పవన్ కల్యాణ్ పట్టుదల. ఆయన ఆ దిశగానే క్యాడర్‌కి క్లారిటీ ఇచ్చేశారు.
జగన్ మంత్రివర్గంలోని కొంతమంది మంత్రులు ప్యాకేజీలతో పాలన చేస్తున్నారని దెందలూరు జనసేన నాయకురాలు డాక్టర్ వెంకటలక్ష్మీ గంటసాల పేర్కొన్నారు. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మరొక్కసారి ప్యాకేజి పవన్ కల్యాణ్ అంటే ఒప్పుకోమని ఆమె హెచ్చరించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సోము వీర్రాజు సమన్వయం చేసుకోలేకపోయారని, జనసేనతో సఖ్యత విషయంలో రాష్ట్ర నాయకత్వం విఫలమైందని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు.