Home / Parliament building
కొత్త పార్లమెంట్ భవనంలో సందర్శకులు, సామాన్లను తనిఖీ చేయడానికి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)ను మోహరిస్తున్నారు. జనవరి 31 నుండి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల నుండి సందర్శకులను,వారి సామాను తనిఖీ చేయడానికి కొత్త చర్యలో భాగంగా 140 మంది సిఐఎస్ఎఫ్ సిబ్బందిని పార్లమెంట్ కాంప్లెక్స్ వద్ద మోహరించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
ప్రతిపక్ష పార్టీల బహిష్కరణ పిలుపు మధ్య ఆదివారం కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పట్టాభిషేకంగా పరిగణించారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. పార్లమెంటును ఆయన ప్రజలగొంతుగా అభివర్ణించారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ సహా పలు ప్రతిపక్ష పార్టీలు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.
కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై కొనసాగుతున్న వివాదం మధ్య, లాలూ యాదవ్ రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ ) కొత్త భవనం డిజైన్‌ను శవపేటికతో పోల్చింది."ఇది ఏమిటి" అనే శీర్షికతో కొత్త పార్లమెంటు భవనం చిత్రంతో పాటు శవపేటిక చిత్రాన్ని ఆదివారం ఆర్జేడీ ట్వీట్ చేసింది.
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. మే 28న కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ దేశానికి అంకితం చేయనున్నారు