Home / Pakistan
పాకిస్థాన్ మాజీ ముఖ్యమంత్రి ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీ, ఆయన పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ)కి చెందిన మరో 80 మంది సభ్యులను నో ఫ్లై లిస్ట్‌లో చేర్చినట్లు సంబంధిత వర్గాలు గురువారం తెలిపాయి. వీరు వాణిజ్య విమానంలో ప్రయాణించకుండా నిషేధించబడతారు. భద్రతాపరమైన ప్రమాదంగా పరిగణించబడతారు.
పాకిస్తాన్ సుప్రీం కోర్టు న్యాయమూర్తుల వేతనాలు అధ్యక్షుడు, ప్రధాన మంత్రి, మంత్రులు, సమాఖ్య కార్యదర్శులు మరియు పార్లమెంటేరియన్ల కంటే ఎక్కువగా ఉన్నాయని పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి సమర్పించిన నివేదిక వెల్లడించింది.
పాకిస్తాన్‌లోని వాయువ్య ప్రాంతంలోని బొగ్గు గనిని డీలిమిటేషన్ చేయడంపై సోమవారం రెండు తెగల మధ్య జరిగిన ఘర్షణలో 15 మంది మరణించారు. కోహట్ జిల్లాలోని పెషావర్‌కు నైరుతి దిశలో 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న దర్రా ఆడమ్ ఖేక్ ప్రాంతంలో సన్నీఖేల్ మరియు జర్గున్ ఖేల్ తెగల మధ్య గని డీలిమిటేషన్ విషయంలో ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్‌కు ఆ దేశ సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఇమ్రాన్‌ను అవినీతి నిరోధక విభాగం ఇమ్రాన్ ను చట్టవిరుద్ధంగా అరెస్టు చేసిందన్న
ఇమ్రాన్ అరెస్టుతో పాకిస్థాన్ అట్టుడుకుతోంది. మాజీ ప్రధాని, తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో పాకిస్థాన్‌లో పరిస్థితి గందరగోళంగా తయారయ్యింది. దేశంలో నెలకొన్న తీవ్రఉద్రిక్త పరిస్థితులను అధికారులు అదుపు చెయ్యలేకపోతున్నారు. కాగా ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తరువాత తాజాగా బుధవారం రాత్రి ప్రధాని షెహబాజ్ షరీఫ్ జాతినుద్దేశించి ప్రసంగించారు.
.పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టు దేశవ్యాప్తంగా అతని మద్దతుదారులు నిరసన ప్రదర్శనలకు దిగారు. రావల్పిండిలోని ఆర్మీ ప్రధాన కార్యాలయం మరియు లాహోర్‌లోని కార్ప్స్ కమాండర్ నివాసంపై దాడి చేశారు. ఖాన్ మద్దతుదారులు గుజ్రాన్వాలా కంటోన్మెంట్ ప్రవేశాన్ని తగులబెట్టారు
పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌ను మంగళవారం ఇస్లామాబాద్ హైకోర్టు వెలుపల అరెస్టు చేసారు. అల్-ఖాదిర్ ట్రస్ట్ కేసులో ఇమ్రాన్‌ను అరెస్టు చేసినట్లు ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజీ) అక్బర్ నాసిర్ ఖాన్ పేర్కొన్నట్లు ఇస్లామాబాద్ పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు.
:ప్రస్తుతం పాకిస్తాన్ పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో మునిగిపోయింది. వచ్చే నెల 30వ తేదీ నాటికి 3.7 బిలియన్ డాలర్ల విదేశీ రుణాలు చెల్లించాల్సి ఉందని బ్లూమ్‌బర్గ్ శుక్రవారం నాడు విడుదల చేసిన ఓ నివేదికలో వెల్లడించింది
ICC ODI Rankings: ప్రపంచ్ కప్ కు ముందు పాకిస్థాన్ ఐసీసీ ర్యాంకింగ్స్ లో మెుదటి స్థానానికి వెళ్లింది. మంచి ఫామ్ లో ఉన్న ఆ జట్టు న్యూజిలాండ్ పై వరుస విజయాలు సాధించి తొలి స్థానానికి దూసుకెళ్లింది.
ప్రస్తుతం ఆసియాలో ద్రవ్యోల్బణం శరవేగంగా పెరుగుతున్న దేశాల్లో పాకిస్తాన్ అగ్రస్థానంలో ఉంది. ఒక విధంగా చెప్పాలంటే శ్రీలంకను కూడా మించిపోయింది. దీనికి ప్రధాన కారణం డాలర మారకంతో స్థానిక కరెన్సీ బలహీనపడ్డంతో పాటు ఆహారం, ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో దాని ప్రభావం ఏప్రిల్ నెల ద్రవ్యోల్బణంపై పడింది.