Home / Pakistan
Asia Cup 2023: ఆసియా కప్ షెడ్యూల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ క్లారిటీ ఇచ్చింది. ఈ వారంలోనే ఆసియా కప్ షెడ్యూల్‌ను ప్రకటించనున్నట్టు వెల్లడించింది.
తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ దేశంలోని ప్రధాన విమానాశ్రయాల కార్యకలాపాలను అవుట్సోర్సింగ్కు ఇవ్వాలని యోచిస్తోంది. ఇస్లామాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (IIA)ని విదేశీ ఆపరేటర్లకు అవుట్సోర్స్ చేయడానికి చర్చలు జరుగుతున్నాయి.
పాకిస్థాన్‌లో కురుస్తున్న వర్షాల కారణంగా వరదలు మరియు కొండచరియలు విరిగిపడటంతో ఎనిమిది మంది చిన్నారులతో సహా కనీసం 50 మంది మరణించారని అధికారులు శుక్రవారం తెలిపారు.జూన్ 25 న రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుండి పాకిస్తాన్ అంతటా వివిధ వర్షాలకు సంబంధించిన సంఘటనలలో యాభై మరణాలు నమోదయ్యాయి.
Slap Kabaddi: తెలుగు రాష్ట్రాల ప్రజలకు కబడ్డీ ఆట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నిజం చెప్పాలంటే కబడ్డీ మన రాష్ట్ర క్రీడ. ఇప్పుడిది ప్రపంచంలో ఉన్న వివిధ గేమ్స్ లో ఇది కూడా ఓ మంచి గేమ్ గా గుర్తింపు పొందింది.
చైనీస్ బిలియనీర్ అలీబాబా వ్యవస్థాపకుడు మన పొరుగున ఉన్న పాకిస్తాన్లో రహస్యపర్యటన ప్రస్తుతం పాక్‌లో హాట్ టాపిక్‌గా మారింది. నేపాల్ నుంచి పలువురు వ్యాపారవేత్తలతో కలసి ప్రత్యేక విమానంలో పాక్‌గడ్డపై దిగారు. మొత్తం 23 గంటల పాటు అక్కడ గడిపారని ఎక్స్‌ప్రెస్ ట్రైబ్యూన్ వెల్లడించింది.
పాకిస్థాన్ హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ (హెచ్ఈసీ) యూనివర్శిటీల్లో హోలీ వేడుకలను నిషేధించింది . జూన్ 12న క్వాయిడ్-ఐ-అజం యూనివర్శిటీ విద్యార్థులు క్యాంపస్‌లో హోలీని జరుపుకున్నారు. ఈవెంట్ యొక్క వీడియోలు వైరల్ అయిన కొన్ని రోజుల తర్వాత ఈ ఆదేశం జారీ అయింది.
అమృత్సర్ నుండి అహ్మదాబాద్‌కు వెళ్లే ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం ప్రతికూల వాతావరణం కారణంగాపాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించింది. ఫ్లైట్ రాడార్ ప్రకారం భారత విమానం శనివారం రాత్రి 7:30 గంటలకు లాహోర్‌కు ఉత్తరాన ప్రవేశించి రాత్రి 8:01 గంటలకు భారతదేశానికి తిరిగి వచ్చినట్లు డాన్ వార్తాపత్రిక నివేదించింది.
పాకిస్థాన్ వాయువ్య ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా అనేక ఇళ్లు కూలిపోవడంతో కనీసం 25 మంది మరణించగా 145 మంది గాయపడ్డారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లోని బన్నూ, లక్కీ మార్వాట్ మరియు కరక్ జిల్లాల్లో వర్షాలు కారణంగా చెట్లుు, ఎలక్ట్రికల్ ట్రాన్స్మిటర్స్ టవర్స్ నేలకూలాయి.
పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అత్యంత దారుణంగా తయారైంది. వచ్చే ఆర్థిక సంవత్సరం పాక్ జీడీపీ 3.5 శాతంగా నేషనల్ ఎకనమిక్ కౌన్సిల్ మంగళవారం నాడు లక్ష్యంగా నిర్దేశించింది. అయితే ప్రపంచబ్యాంకు మాత్రం వచ్చే ఆర్థిక సంవత్సరం రెండు శాతం దాటితే మహా గొప్ప అని పెదవి విరిచింది. దీనికి వరల్డ్ బ్యాంకు ఇస్తున్న వివరణ ఇలా ఉంది.
రెండు ఐక్యరాజ్యసమితి సంస్థలు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) మరియు ప్రపంచ ఆహార కార్యక్రమం (WFP) పాకిస్తాన్లో తీవ్రమైన ఆహార అభద్రతను అంచనా వేసింది, ఇది ఆర్థిక మరియు రాజకీయ సంక్షోభం మరింత తీవ్రరూపం దాల్చితే రాబోయే నెలల్లో మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.