Home / Opposition
పార్లమెంట్లో ‘ఇండియా’ కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై గురువారం సాయంత్రం ప్రధానమంత్రి మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్షాలపై కౌంటర్ ఎటాక్ చేశారు. విపక్షాలు కేంద్రంపై పదేపదే అవిశ్వాసం పెట్టి అభాసుపాలవుతున్నాయని.. వారి అవిశ్వాస తీర్మానాల వల్ల ప్రభుత్వంపై ప్రజలకు మరింత విశ్వాసం పెరుగుతోందని చురకలంటించారు
చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగిన హింసాత్మక ఘటనలను ప్రజాస్వామ్య వాదులందరూ ఖండించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేసారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేసారు. రాష్ట్రంలో వైసీపీ సర్కార్ వైఖరి ప్రతిపక్షం గొంతు నొక్కేలా ఉందన్నారు.
మణిపూర్‌పై కొనసాగుతున్న పార్లమెంటు ప్రతిష్టంభన నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం విపక్ష కూటమి ఇండియాపై తీవ్రమైన విమర్శలను గుప్పించారు. దేశం పేరు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించలేమని అన్నారు. బిజెపి పార్లమెంటరీ పార్టీని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తూ విపక్షాలు నిరాశ మరియు నిరుత్సాహానికి గురయ్యాయని అన్నారు.
ఐక్యత కోసం పిలుపుతో, 2024 సార్వత్రిక ఎన్నికల వ్యూహాన్ని రూపొందించడానికి 26 ప్రతిపక్ష పార్టీల అగ్రనేతలు బెంగళూరులో కీలక సమావేశానికి హాజరవుతున్నారు. దీనికి ప్రతిగా ఈరోజు తర్వాత న్యూఢిల్లీలో బీజేపీ మెగా మీట్ నిర్వహించనుంది. చర్చల ఎజెండాను లాంఛనంగా చేయడానికి ప్రతిపక్ష అగ్రనేతలు నిన్న విందు సమావేశాన్ని నిర్వహించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అధికారికంగా చర్చలు జరగనున్నాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపక్ష పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో అత్యంత అవినీతిపరులు ఈరోజు బెంగళూరులో సమావేశం అవుతున్నారని అన్నారు. విపక్షాల నినాదం కుటుంబమే ప్రథమం, దేశం ఏమీ కాదు అని ప్రధాని మోదీ అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం నాడు ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు. వాళ్లకే గ్యాంరటీ లేని వారు కొత్త కొత్త గ్యారంటీలతో పాటు కొత్త స్కీంలతో హామీలను ఇస్తున్నారని మోదీ అన్నారు.
కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలని తీసుకున్న విపక్షాల నిర్ణయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు విరుచుకుపడ్డారు.జపాన్, పపువా న్యూ గినియా మరియు ఆస్ట్రేలియాలో మూడు దేశాల పర్యటన ముగించుకుని ప్రధాని గురువారం ఢిల్లీ చేరుకున్నారు.
నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవి ఆగస్టు 12 వరకు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో కేంద్రం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. వీటిలో కంటోన్మెంట్ బిల్లు, మల్టీ-స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ బిల్లుతో సహా పలు బిల్లులు
ప్రతిపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మార్గరెట్ అల్వాను ప్రకటించాయి. ఈ విషయాన్ని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ప్రకటించారు. ఢిల్లీలో జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశంలో ఆమెను తమ అభ్యర్థిగా నిలబెట్టాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు.