Home / Operation Ajay
ఆపరేషన్ అజయ్ లో భాగంగా ఇజ్రాయెల్ నుంచి 197 మంది భారతీయులతో మూడవ విమానం ఢిల్లీ చేరుకుంది. ఇజ్రాయెల్ నుంచి తిరిగి వచ్చిన వారికి ఢిల్లీ విమానాశ్రయంలో కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ స్వాగతం పలికారు. ఇజ్రాయెల్ నుంచి వచ్చిన భారతీయులందరికీ మంత్రి భారత జెండాలను అందజేశారు.
ఇజ్రాయెల్లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి మొదటి చార్టర్ విమానం గురువారం రాత్రి టెల్ అవివ్ లోని బెన్ గురియన్ విమానాశ్రయం నుంచి బయలుదేరి శుక్రవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో దిగింది.
ఇజ్రాయెల్ నుండి స్వదేశానికి తిరిగి రావాలనుకునే భారతీయుల కోసం 'ఆపరేషన్ అజయ్' ప్రారంభించినట్లు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రకటించారు. ఇందుకోసం ప్రత్యేక చార్టర్ విమానాలు, ఇతర ఏర్పాట్లు చేస్తున్నట్లు జైశంకర్ తెలిపారు. ప్రస్తుతం ఇజ్రాయెల్లో దాదాపు 18,000 మంది భారతీయులు నివసిస్తున్నారని అంచనా.