Operation Ajay: ఆపరేషన్ అజయ్: ఇజ్రాయెల్ నుంచి ఢిల్లీకి చేరిన 212 మంది భారతీయులు
ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి మొదటి చార్టర్ విమానం గురువారం రాత్రి టెల్ అవివ్ లోని బెన్ గురియన్ విమానాశ్రయం నుంచి బయలుదేరి శుక్రవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో దిగింది.

Operation Ajay: ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి మొదటి చార్టర్ విమానం గురువారం రాత్రి టెల్ అవివ్ లోని బెన్ గురియన్ విమానాశ్రయం నుంచి బయలుదేరి శుక్రవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో దిగింది. ఈ విమానంలో 212 మంది భారతీయులు తిరిగి స్వదేశానికి వచ్చారు. వారికి కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఎయిర్ పోర్ట్ లో స్వాగతం పలికారు. ఇజ్రాయెల్-పాలస్థీనాల మధ్య యుద్ధ భయాల నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న భారతీయులు తమను స్వదేశానికి తిరిగి తీసుకెళ్లాలని భారత ప్రభుత్వాన్ని కోరారు.
భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు..(Operation Ajay)
వెంటనే స్పందించిన ప్రభుత్వం.. ఆపరేషన్ అజయ్ పేరుతో వారిని తిరిగి రప్పించే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇజ్రాయెల్, గాజా ల పరస్పర రాకెట్ల దాడులతో 2 వేల 500 మంది చనిపోయారు. 5 వేలకు పైగా గాయపడ్డారు. ఇజ్రాయెల్ లో ఇలాంటి పరిస్థితిని చూడటం ఇదే తొలిసారి. మమ్మల్ని తిరిగి తీసుకువచ్చినందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు. యుద్ధ భయాలు త్వరగా తొలగిపోతాయని ఆశిస్తున్నాం. తద్వారా మేము అక్కడికి తిరిగి వెళ్ళగలం”అని ఓ ప్రయాణికుడు తన అనుభవాన్ని షేర్ చేసుకున్నాడు. స్వదేశానికి తిరిగి రావాలనుకునే భారతీయులకు వీలుగా ఆపరేషన్ అజయ్‌ను ప్రారంభించినట్లు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
- Bandla Ganesh : పవన్ గురించి తెలిసి తెలియకుండా అబాండాలు వేయొద్దని సీఎం జగన్ కి స్వీట్ వార్నింగ్ ఇచ్చిన బండ్ల గణేష్..
- Revanth Reddy Warning: కాంగ్రెస్ కార్యకర్తలను బెదిరిస్తే మిత్తితో చెల్లిస్తాం.. రేవంత్ రెడ్డి