Home / O Panneerselvam
ఎఐఎడిఎంకె ప్రధాన కార్యదర్శి ఇ పళనిస్వామికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పార్టీలో ద్వంద్వ నాయకత్వాన్ని పునరుద్ధరిస్తూ ఆయన బద్ధ ప్రత్యర్థి పన్నీర్ సెల్వంకు అనుకూలంగా మద్రాసు హైకోర్టు తీర్పునిచ్చింది.
ఏఐఏడీఎంకే నుంచి ఓ పన్నీర్‌సెల్వం ను బహిష్కరిస్తూ జనరల్ కౌన్సిల్ సమావేశం తీసుకున్న నిర్ణయం చెల్లదని పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి వీకే శశికళ అన్నారు. ఇది కేవలం స్వార్దప్రయోజనాలకోసం సమావేశమయిందని ఆమె మండిపడ్డారు. ఇప్పటికీ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి తానేనని శశికళ అన్నారు.
తమిళనాడులోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకేలో రెండు గ్రూపుల మధ్య పోరు తారస్దాయికి చేరుకుంది. ప్రస్తుతం ఉన్న ద్వంద్వ-నాయకత్వ నమూనాకు స్వస్తి పలికి అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎడప్పాడి పళనిస్వామి ఎన్నికయ్యారు నేడు జరిగిన అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ పళనిస్వామిని ఎన్నుకుంది.
అన్నాడీఎంకే లో మరోసారి రచ్చ మొదలైంది. పార్టీ కార్యాలయాల వద్దే ఇరు వర్గాల కార్యకర్తుల బాహాబాహీకి దిగారు. రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. అన్నాడీఎంకే పై పట్టు కోసం అటు పన్నీర్ సెల్వం, ఇటు ఎడప్పాడి పళనిస్వామి రెండు వర్గాలుగా చీలిపోయారు. పార్టీ ఒకరి చేతిలోనే ఉండాలని పళని స్వామి ధర్మాసనాన్ని ఆశ్రయించారు.