Home / notices
Notices To YSRCP Social Media Activists: వైసీపీకి మరోసారి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ సోషల్ మీడియా వింగ్ రాష్ట్ర నేతలు సజ్జల భార్గవ్, అర్జున్‌రెడ్డితోపాటు మరో 15మందికి నోటీసులు జారీ చేశారు. ఇవాళ విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వ నేతలపై అసభ్యకర పోస్టుల నేపథ్యంలో నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తున్నది. పోలీసులు విజయవాడలోని సజ్జల భార్గవ ఇంటికి వెళ్లగా, ఇంట్లో లేకపోవడంతో భార్గవ తల్లికి నోటీసులు అందజేశారు. […]
చత్తీస్గడ్ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంపై కేసీఆర్ కు జస్టిస్ నరసింహారెడ్డి నోటీసులు జారీ చేశారు. కొనుగోళ్లపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు గులాబీ అధినేతకు నోటీసులు జారీ చేశారు. జులై 30 వరకు ధర్మాసనాన్ని కేసీఆర్ సమయం కోరారు.
శ్రీకాళహస్తి ఘటనపై రాష్ట్ర మానవహక్కుల సంఘం సీరియస్ అయ్యింది. జనసేన నాయకుడిపై సిఐ అంజూయాదవ్ చేయి చేసుకున్న ఘటనపై హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మీడియాలో వచ్చిన కధనాలను.. సుమోటోగా తీసుకుని హ్యూమన్ రైట్స్ కమిషన్ కేసు నమోదు చేసింది. ఈనెల 27లోగా వివరణ ఇవ్వాలని సిఐ అంజూయాదవ్.. డిఎస్పీ, ఎస్పీలకు నోటీసులు జారీ చేసింది.
పశ్చిమ బెంగాల్లో సినిమాపై నిషేధం, తమిళనాడులో డిఫాక్టో నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ 'ది కేరళ స్టోరీ' నిర్మాతలు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసు జారీ చేసింది. ఈ నెల 8న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాష్ట్రంలో ఈ సినిమాను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా తమిళనాడు మల్టీప్లెక్స్ యజమానులు ఈ సినిమాను ప్రదర్శించకూడదని నిర్ణయించుకున్నారు.
మాజీ ఎంపీ ఆనంద్ మోహన్‌ను జైలు నుంచి ముందస్తుగా విడుదల చేయడంపై సుప్రీంకోర్టు సోమవారం బీహార్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.ఐఏఎస్ అధికారి జి కృష్ణయ్య హత్య కేసులో జీవిత ఖైదు పడిన ఆనంద్ మోహన్, బీహార్ జైలు నిబంధనల సవరణతో గత నెలలో సహర్సా జైలు నుంచి బయటకు వచ్చారు.
పశ్చిమ బెంగాల్‌లోని శాంతినికేతన్‌లోని తన క్యాంపస్‌లోని 1.38 ఎకరాల లీజు భూమిలో 13 డెసిమల్స్ భూమిని మే 6 లోగా ఖాళీ చేయాలని విశ్వభారతి యూనివర్శిటీ నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ కు నోటీసులు పంపింది.
మొయినాబాద్ ఫాంహౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో భాగంగా టీబీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు సీఆర్పీసీ 41 ఏ కింద నోటీసులు జారీ చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు విశాఖ పోలీసులు 41ఏ నోటీసులిచ్చారు. పవన్ విశాఖలోనే ఉంటే శాంతి భద్రతలకు భంగం కలిగే ప్రమాదముందని నాలుగు గంటల్లో నగరం విడిచి వెళ్లిపోవాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడి కుమారుడు చింతకాయల విజయ్ ఇంటికి ఏపీ పోలీసులు రావడం కలకలం రేపింది. బంజారాహిల్స్‌లోని విజయ్ ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు శనివారం వచ్చారు. హైదరాబాద్ లోని విజయ్ ఇంట్లో అతను లేకపోవడంతో అతని సిబ్బందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు.
బిల్కిస్ బానో గ్యాంగ్‌రేప్ కేసులో గుజరాత్ ప్రభుత్వం 11 మంది దోషులకు క్షమాబిక్షమంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం నోటీసు జారీ చేసింది.