Last Updated:

PM Modi: అక్టోబర్ 1న 5జీ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 1న ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఈవెంట్‌లో భారతదేశంలో 5G సేవలను ప్రారంభించనున్నారు.

PM Modi: అక్టోబర్ 1న 5జీ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

New Delhi: ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 1న ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఈవెంట్‌లో భారతదేశంలో 5G సేవలను ప్రారంభించనున్నారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ ( ఐఎంసి) అనేది ఆసియాలో అతిపెద్ద టెలికాం, మీడియా మరియు టెక్నాలజీ ఫోరమ్, దీనిని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ( డాట్ ) మరియు సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ( సిఒఎఐ ) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.

అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్, గురుగ్రామ్, హైదరాబాద్, జామ్‌నగర్, కోల్‌కతా, లక్నో, ముంబై మరియు పూణేలలో మొదటి దశ హైస్పీడ్ 5G ఇంటర్నెట్‌ను ప్రారంభించనున్నట్లు టెలికాం విభాగం గతంలో ప్రకటించింది. టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ గత వారం 5G యొక్క రేడియేషన్ ప్రభావంపై భయాలను కొట్టిపారేసారు. 5G నుండి వచ్చే రేడియేషన్ ప్రపంచ ఆరోగ్యసంస్ద సిఫార్సు చేసిన స్థాయిల కంటే చాలా తక్కువగా ఉందని తెలిపారు.

విద్యార్థులతో ఇంటరాక్టివ్ సెషన్‌లో మంత్రి మాట్లాడుతూ, టెలికాం ఆపరేటర్‌లు తమ సేవల నాణ్యతను మెరుగుపరచాలని కేంద్రం కోరిందని, ఐఐటి-మద్రాస్‌లో 5 జి ల్యాబ్‌ను అభివృద్ధి చేసినట్లు తెలిపారు.పరిశ్రమలోకి దాదాపు రూ.2.5-3 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని భావిస్తున్నాం. రూ.3 లక్షల కోట్లు పెద్ద పెట్టుబడి. ఇది మంచి ఉపాధి కల్పనకు కూడా దారి తీస్తోంది. మా అంచనా ప్రకారం వచ్చే 2-3 ఏళ్లలో దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలకు 5G అందుబాటులోకి వస్తుందని వైష్ణవ్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి: