Last Updated:

Alert: బ్యాంకు కస్టమర్లకు అలెర్ట్‌.. ఆ రోజుల్లో బ్యాంకులకు సెలవు

సెప్టెంబర్ నెల ఆఖరుకు వచ్చింది. అక్టోబర్ నెల ప్రారంభకావడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. అక్టోబర్ నెలలో దీపావళి, నవరాత్రి, దసరాతో సహా వివిధ పండుగల కారణంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో మొత్తం 21 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. మరి దానికి సంబంధించి ఏఏ రోజులు వర్కింగ్, ఏఏ హాలిడేనో చూసేద్దామా..

Alert: బ్యాంకు కస్టమర్లకు అలెర్ట్‌.. ఆ రోజుల్లో బ్యాంకులకు సెలవు

Alert: సెప్టెంబర్ నెల ఆఖరుకు వచ్చింది. అక్టోబర్ నెల ప్రారంభకావడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. అక్టోబర్ నెలలో దీపావళి, నవరాత్రి, దసరాతో సహా వివిధ పండుగల కారణంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో మొత్తం 21 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. మరి దానికి సంబంధించి ఏఏ రోజులు వర్కింగ్, ఏఏ హాలిడేనో చూసేద్దామా.

అక్టోబర్ 1 – గ్యాంగ్ టక్లో బ్యాంకు ఖాతాలకు అర్ధ-వార్షిక ముగింపు సెలవు

అక్టోబర్ 2 – దేశమంతటా ఆదివారం, గాంధీ జయంతి సెలవు

అక్టోబర్ 3 – అగర్తల, భువనేశ్వర్, గౌహతి, ఇంఫాల్, కోల్‌కతా, పాట్నా, రాంచీ ప్రాంతాల్లో దుర్గా పూజ (మహా అష్టమి) సందర్భంగా సెలవు

అక్టోబర్ 4 – అగర్తల, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, గ్యాంగ్‌టక్, గౌహతి, కాన్పూర్, కొచ్చి, కోల్‌కతా, లక్నో, పాట్నా, రాంచీ, షిల్లాంగ్, తిరువనంతపూర్ ప్రాంతాల్లో దుర్గా పూజ / దసరా (మహానవమి) / ఆయుధ పూజ / శ్రీమంత్ శంకర్‌దేవ్ పుట్టినరోజు సందర్భంగా సెలవు

అక్టోబర్ 5 – దేశమంతటా విజయదశమి మరియు శ్రీమంత్ శంకర్‌దేవ్ పుట్టినరోజు సందర్భంగా సెలవు

అక్టోబర్ 6 – గ్యాంగ్‌టక్లో దుర్గా పూజ సందర్భంగా సెలవు.

అక్టోబర్ 7 – గ్యాంగ్‌టక్లో దుర్గా పూజ (దాసాయి) సందర్భంగా బ్యాంకుకు సెలవు.

అక్టోబర్ 8 – దేశమంతటా రెండవ శనివారం, మిలాద్-ఎ-షరీఫ్/ఈద్-ఇ-మిలాద్-ఉల్-నబీ (ప్రవక్త ముహమ్మద్ జన్మదినం ) నేపథ్యంలో సెలవు

అక్టోబర్ 9 – ఆదివారం కావడం వల్ల బ్యాంకులకు దేశమంతటా సెలవు

అక్టోబర్ 13 – సిమ్లాలో కర్వా చౌత్ పర్వదినం సందర్భంగా సెలవు

అక్టోబర్ 14 – శుక్రవారం ఈద్-ఎ-మిలాద్-ఉల్-నబీ సందర్భంగా జమ్మూ, శ్రీనగర్ ప్రాంతంలో బ్యాంకులకు సెలవు

అక్టోబర్ 16 – ఆదివారం కావడం వల్ల దేశమంతటా సెలవు

అక్టోబర్ 18 – కటి బిహు పర్వదినం సందర్భంగా గౌహతి ప్రాంతంలోని బ్యాంకులకు సెలవు

అక్టోబర్ 22 – నాల్గవ శనివారం కావడం వల్ల దేశమంతటా సెలవు

అక్టోబర్ 23 – ఆదివారం కావడం వల్ల దేశమంతటా సెలవు

అక్టోబర్ 24 – కాళీ పూజ/దీపావళి/దీపావళి (లక్ష్మీ పూజ/నరక్ చతుర్దశి) సందర్భంగా గ్యాంగ్‌టక్, హైదరాబాద్, ఇంఫాల్ మినహా అన్ని ప్రదేశాలు బ్యాంకులకు సెలవు.

అక్టోబర్ 25 – లక్ష్మీ పూజ/దీపావళి/గోవర్ధన పూజ సందర్భంగా గ్యాంగ్టక్, హైదరాబాద్, ఇంఫాల్, జైపూర్ ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు

అక్టోబర్ 26 – గోవర్ధన్ పూజ/విక్రమ్ సంవంత్ నూతన సంవత్సరం రోజు/భాయ్ బిజ్/భాయ్ దూజ్/దీపావళి (బలి ప్రతిపద)/లక్ష్మీ పూజ సందర్భంగా అహ్మదాబాద్, బేలాపూర్, బెంగళూరు, డెహ్రాడూన్, గాంగ్టక్, జమ్మూ, కాన్పూర్, లక్నో, ముంబై, నాగ్పూర్, సిమ్లా, శ్రీనగర్ ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు

అక్టోబర్ 27 – భాయ్ దూజ్ / చిత్రగుప్త జయంతి / లక్ష్మీ పూజ / దీపావళి / నింగోల్ చకౌబా సందర్భంగా గాంగ్టక్, ఇంఫాల్, కాన్పూర్, లక్నో ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు

అక్టోబర్ 30 – ఆదివారం కావడం వల్ల దేశమంతటా సెలవు

అక్టోబర్ 31 – సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టినరోజు / సూర్య షష్ఠి దళ ఛత్ (ఉదయం) / ఛత్ పూజ నేపథ్యంలో అహ్మదాబాద్, పాట్నా మరియు రాంచీ ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు కాబట్టి ఆయా ప్రాంతాల ప్రజలు వీటిని గుర్తించి ఆయారోజుల్లో బ్యాంకులను వెళ్లకపోవడం మంచిది

ఇదీ చదవండి: Lalu And Nitish Meet Sonia Gandhi: సోనియాతో భేటీకానున్న లాలూ, నితీశ్.. మహాకూటమిపై చర్చ..!

ఇవి కూడా చదవండి: