Student Shoots Teacher: తుపాకీతో టీచర్ పై కాల్పులు జరిపిన విద్యార్థి.. అసలేం జరిగిందంటే..!
విద్యాబుద్దులు నేర్పుతున్న గురువులు ఏమన్నా పడే రోజులు పోయాయ్. ఒకప్పుడు బెత్తంతో భయం చెప్పినా కిక్కురుమనకుండా విద్యనభ్యసించడం చూశాం కానీ ఇప్పుటి కాలం విద్యార్థులైతే అందుకు భిన్నంలెండి. తరగతి విద్యార్థుల ముందు టీచర్ తిట్టాడని నామోషీగా ఫీల్ అయ్యాడో ఏమో తెలియదు కానీ ఆ కోపంతో ఓ పదో తరగతి విద్యార్థి ఉపాధ్యాయుడిపై కాల్పులు తెగబడ్డాడు. నాటు తుపాకీతో టీచర్‌ను వెంబడించిన మరీ ఏకంగా మూడు రౌండ్లు కాల్చాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.
Student Shoots Teacher: విద్యాబుద్దులు నేర్పుతున్న గురువులు ఏమన్నా పడే రోజులు పోయాయ్. ఒకప్పుడు బెత్తంతో భయం చెప్పినా కిక్కురుమనకుండా విద్యనభ్యసించడం చూశాం కానీ ఇప్పుటి కాలం విద్యార్థులైతే అందుకు భిన్నంలెండి. తరగతి విద్యార్థుల ముందు టీచర్ తిట్టాడని నామోషీగా ఫీల్ అయ్యాడో ఏమో తెలియదు కానీ ఆ కోపంతో ఓ పదో తరగతి విద్యార్థి ఉపాధ్యాయుడిపై కాల్పులు తెగబడ్డాడు. నాటు తుపాకీతో టీచర్‌ను వెంబడించిన మరీ ఏకంగా మూడు రౌండ్లు కాల్చాడు. అయితే బుల్లెట్‌లు శరీరంలోని సున్నిత అవయవాలకు తగలకపోవడం వల్ల టీచర్‌కు ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్లో జరిగింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సీతాపూర్ జిల్లాలోని ఓ పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థి తోటి విద్యార్థితో గొడవపడ్డాడు. అది గమనించిన ఉపాధ్యాయుడు ఇద్దరినీ మందలించి అక్కడి నుంచి పంపాడు. దానితో టీచర్‌పై కోపం పెంచుకున్న ఒక విద్యార్థి నాటు తుపాకీతో టీచర్‌పై కాల్పులు జరిపాడు. ఉపాధ్యాయుడిని దొంగచాటుగా వెంబడించిన విద్యార్థి ఒక్కసారిగా కాల్పులకు దిగిన దృశ్యాలు సీసీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. తుపాకీలో బుల్లెట్‌లు అయిపోయిన తర్వాత టీచర్ రక్తస్రావంతో విద్యార్థి దాడి ఎదుర్కొంటుండగా చేతిలోని తుపాకీతో ఆ పదోతరగతి విద్యార్థి దాడి తెగబడ్డాడు. అది గమనించిన స్థానికులు విద్యార్థిని పట్టుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. ఇందులో ఆలోచించాల్సిన విషయం ఏంటంటే పదోతరగతి విద్యార్థికి నాటు తుపాకీ ఎక్కడి నుంచి లభించిందని. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: Fire Accident In Renigunta: రేణిగుంటలో ఘోర అగ్నిప్రమాదం.. వైద్యుడు సహా ఇద్దరు చిన్నారులు మృతి