Home / national news
ఏదైనా దేవాలయానికి వెళ్లినప్పుడు చెప్పులు బయటే విడిచి వెళతాం. అలా చెప్పులువేసుకుని దేవాలయానికి వెల్లడం అపచారంగా హిందువులు భావిస్తుంటారు. కానీ అందుకు భిన్నంగా అక్కడి గుడిలోని అమ్మవారికి చెప్పులనే మొక్కులుగా సమర్పించుకుంటారు. మరి ఆ గుడి ఎక్కడుంది? ఎందుకు అలా చెప్పులను అమ్మవారికి సమర్పిస్తారో ఈ కథనం చదివెయ్యండి.
టెక్నాలజీ పరంగా ఎంతగా ఎదిగినా మనిషి మూఢనమ్మకాలను విశ్వసిస్తూనే ఉన్నాడు. శివుడి ఆజ్ఞ అంటూ ఓ చిన్నారిని ఇద్దరు దుర్మార్గులు బలితీసుకున్నారు. ఈ అమానవీయ దారుణ ఘటన ఢిల్లీలోని లోధిలో చోటుచేసుకుంది.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కర్ణాటకలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర కోసం సోమవారం మధ్యాహ్నం మైసూర్ చేరుకున్నారు.
దేవీనవరాత్రుల్లో భాగంగా సంప్రదాయబద్ధంగా నృత్యం చేస్తూ ఆ ప్రాంతవాసులు జగన్మాతను ఆరాధిస్తున్నారు. కానీ అకస్మాత్తుగా ఓ యువకుడు డాన్స్ చేస్తూ గుండెపోటుతో అక్కడే కుప్పకూలిపోయాడు. దీనితో శరన్నవరాత్రి ఉత్సవాల్లో విషాదం నెలకొంది. ఈ ఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది.
కోల్‌కతాలోని ఒక దుర్గా మండపంలో 'మహిసాసురుడి స్థానంలో మహాత్మా గాంధీని పోలి ఉండేలా రూపొందించడం జాతిపిత జయంతి రోజున వివాదాన్ని సృష్టించింది.
అనేక కొత్తకొత్త ఆవిష్కరణలు, టెక్నాలజీతో మార్కెట్లో ఇప్పటికే జియో సంచలనం సృష్టిస్తోంది. కాగా ఇప్పుడు ల్యాప్ టాప్ మార్కెట్లో రిలయన్స్ జియో సరికొత్త ఒరవడిని సృష్టించనుంది. సామాన్యుల బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలోనే అనగా రూ.15వేలలో ల్యాప్ ట్యాప్‌ను మార్కెట్లో విడుదల చేయనుంది.
దుర్గామాత పూజలో అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి ముగ్గురు అగ్నికి ఆహుతయ్యారు. మరో 60 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం ఉత్తరప్రదేశ్‌లోని భదోహిలో చోటుచేసుకుంది.
ఎవరైనా కూరలో ఉప్పు తక్కువైతే కాస్త ఉప్ప వేసుకుని తింటారు. లేదా ఇంకేం వేసుకుంటాములే అని సర్దుకుపోయి తింటారు. మహా అంటే వంట చేసిన భార్యని నాలుగు మాటలంటారు. కానీ ఈ ప్రబుద్ధుడు మాత్రం కూరలో ఉప్పచాలలేదని కట్టుకున్న భార్యనే కడతేర్చాడు. ఈ దారుణ ఘటన బిహార్ రాష్ట్రంలో వెలుగు చూసింది.
పుదుచ్చేరిలో అంధకారం అలముకుంది. సామాన్య ప్రజల ఇళ్లకు కరెంట్ పోతే ఓకే. అదే రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు గవర్నర్ ఇళ్లు, కార్యాలయాలకే పవర్ కట్ అయ్యిందంటే అక్కడ విద్యుత్ సమస్యలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోండి. అదేంటి కేంద్రపాలిత ప్రాంతంలో పవర్ కట్ సమస్యేంటీ అనుకుంటున్నారు కదా. ఇది విద్యుత్ ఉద్యోగుల నిరసన సెగ వల్ల ఏర్పడిన కోతలు.
ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లోని ఇండియా మొబైల్ కాంగ్రెస్ వద్ద ఉన్న ఎరిక్సన్ స్టాల్ నుండి ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ఐరోపాలోని స్వీడన్లో కారును నడిపారు