Home / Natioanl news
ఒడిశా లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో క్షేమంగా బయటపడిన ప్రయాణికుల కోసం రైల్వే శాఖ స్పెషల్ ట్రైన్ ను ఏర్పాటు చేసింది. దాదాపు 250 మంది ప్రయాణికులను ప్రత్యేక రైలులో చెన్నైకి పంపుతున్నట్టు రైల్వే అధికారులు వెల్లడించారు.
ఒడిశాలో జరిగిన మహా విషాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతిని గురి చేసింది. ఇండియన్ రైల్వే చరిత్రలో అతి ఘోర ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిందీ ఈ సంఘటన. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 278 మంది మృతి చెందారు. 900 మందికి పైగా గాయపడ్డారు.
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు, సన్నిహితులకు ఉక్రెయిన్ ప్రజల తరపున ప్రగాఢ సానుభూతి తెలిపారు.
బోగీల నుంచి మృతదేహాల వెలికితీత ఇంకా కొనసాగుతోంది. ఘటనా స్థలి వద్ద ఎన్డీఆర్ఎఫ్ తో సహా భారత ఆర్మీ కూడా సహాయ చర్యల్లో పాల్గొంటోంది.
ఒడిశా రాష్ట్రంలోని బాలేశ్వర్ జిల్లాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతూనే. బోగీల నుంచి మృతదేహాల వెలికితీత ఇంకా కొనసాగుతోంది. ఘటనా స్థలి వద్ద ఎన్డీఆర్ఎఫ్ తో సహా భారత ఆర్మీ కూడా సహాయ చర్యల్లో పాల్గొంటోంది.