Home / Minister Gudivada Amarnath
జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌పై మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. దమ్ముంటే పవన్‌ను 175 స్థానాల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు. నిన్న సభలో స్టీల్‌ప్లాంట్ గురించి ఒక్క మాటైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు. కేంద్రంలో అంత పలుకుబడి ఉంటే విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలన్నారు.
జనసేన అధినేత గేర్ మార్చి సినిమాలు, రాజకీయాలలో స్పీడ్ పెంచారని తెలుస్తుంది. ఒకవైపు వరుస సినిమాలు స్టార్ట్ చేస్తూ దూకుడు పెంచిన పవన్ మరో వైపు రాజకీయాలలో కూడా అధికార పార్టీ నేతలపై పంచ్ ల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా అధికార పార్టీ వైసీపీపై నిప్పులు చెరిగారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్స్ చేసి తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు గుప్పించారు. ముఖ్యంగా ఏపీ సీఎం వైఎస్ జగన్, ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాధ్ పై ఫైర్ అయ్యారు
విశాఖలో నిర్వహించిన ప్రెస్ మీట్లో మంత్రి గుడివాడ అమర్నాధ్ మాట్లాడుతూ, విలేఖరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా బాలయ్య బాబు కాదు తాత అని అన్నారు.
పవన్ కల్యాణ్ సీఎం కావాలని ఫ్యాన్స్ కలలు కంటున్నారని.. సీఎం పవన్ కల్యాణ్ పేరుతో సినిమా తీస్తే తానే నిర్మాతగా ఉంటానని మంత్రి గుడివాడ అమర్నాథ్ సెటైర్లు వేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచార రథం వారాహి విషయం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ట్రెండ్ అవుతుంది. ఇక ఈ ప్రచార రథం రంగుపై అయితే రకరకాల విమర్శలు ప్రతివిమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా తాజాగా ఈ విషయమై ఏపీ ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ సెటైర్లు వేశారు.
మూడు రాజధానుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ అన్నారు. 3 రాజధానుల బిల్లును మళ్లీ అసెంబ్లీలో ప్రవేశపెడతామని చెప్పారు. సీఎం జగన్ ఏ క్షణం నుంచైనా విశాఖ నుంచి పాలన ప్రారంభించవచ్చని ఆయన తెలిపారు.
ఎవరెన్ని యాత్రలు చేసినా, తమ ప్రభుత్వ విధానం మాత్రం మూడు రాజధానుల ఏర్పాటేనని మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేసారు. ముఖ్యమంత్రి జగన్‌ను గద్దె దించాలన్నదే అమరావతి రైతుల పాదయాత్ర లక్ష్యమని ఆరోపించారు.
చంద్రబాబు నాయుడు అమరావతి కోసం గుంటూరు, విజయవాడకు అన్యాయం చేసారని మంత్రి గుడివాడ అమర్నాధ్ ఆరోపించారు. మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతాం. అసెంబ్లీలో మూడు రాజధానులపై బిల్లు పెడతాం.