Home / latest Telangana politics
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఘన చరిత్ర కలిగి ఉంది. అలాంటి విశాఖ ఉక్కును కేంద్రం ప్రైవేటుపరం చెయ్యడాన్ని నిరసిస్తూ యాత్ ఆంధ్రులంతా ఒక్కతాటిపైకి వచ్చి పోరాటం సాగిస్తోన్నారు. కాగా తాజాగా విశాఖ ఉక్కు కర్మాగారంపై తెలంగాణ సర్కార్ ఆసక్తి చూపుతోంది.
కేసీఆర్ ప్రభుత్వంపై సీనియర్ నేతలైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు గత కొంతకాలంగా వ్యతిరేకతతో ఉన్నారు. పలు సందర్బాల్లో బహిరంగంగానే వీరుద్దరూ కేసీఆర్ పై విరుచుకుపడినా అధిష్టానం ఏ యాక్షన్ తీసుకోలేదు.
తెలంగాణలో పదో తరగతి పేపర్ లీక్ ఘటనలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మంగళవారం అర్థరాత్రి కరీంనగర్ లో ఆయన నివాసానికి వెళ్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అరెస్టు అయ్యారు. పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ ఘటనలో బండి సంజయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు మంగళవారం అర్థరాత్రి కరీంనగర్ లోని ఆయన నివాసానికి వెళ్లి బండిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు పోలీసులను అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
బీజేపీ నేతలపై ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. తెలంగాణకు చెందిన ఇద్దరు బీజేపీ ఎంపీలవి కూడా పేక్ సర్టిఫికెట్లే అన్న ఆరోపణలు ఉన్నాయని గుర్తుచేశారు.
స్దల వివాదంతో విడిపోయిన ఇద్దరు అన్నదమ్ములను బలగం సినిమా కలిపింది. తెలంగాణ వ్యాప్తంగా ఇటీవల బలగం సినిమాను పెద్ద ఎత్తున గ్రామాలు, మండల కేంద్రాల్లో ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే
తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాం చోటుచేసుకుంది. తాజాగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, టీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌లకు ఫోన్ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగుల విషయంలో కలిసి పోరాడదామని.. ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చెద్ధామని కోరారని తెలుస్తుంది.
ఒక వైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ను విచారిస్తుండగానే.. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు బీఆర్ఎస్ శ్రేణులకు కీలక సందేశమిచ్చారు.
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ కి ఉచినచ్చని షాక్ తగిలింది. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికల సమరానికి సి అనుకోవాల్సిన తరుణంలో తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్ పార్టీకి పెద్ద దెబ్బే తగిలింది. కాగా తాజాగా వెలువడిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో మరోసారి అధికారంలో వస్తామని గెలుపు పైన అధికార బీఆర్ఎస్ ధీమాగా ఉన్న క్రమంలో షాకింగ్ ఇచ్చే ఫలితాలు వచ్చాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ ఇప్పుడు తాజాగా వార్తల్లో నిలిచారు. కిరణ్ కుమార్ రెడ్డి త్వరలోనే బీజేపీ కండువా కప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్వసనీయ వర్గాలు కోడైకూస్తున్నాయి. ఈ మేరకు కిరణ్ కుమార్ ఇప్పటికే బీజేపీ అగ్రనేతలు చర్చలు జరిపినట్టుగా సమాచారం. మరో రెండు, మూడు రోజుల్లోనే కాంగ్రెస్‌కు రాజీనామా చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.