Ys Sharmila : బండి సంజయ్, రేవంత్ రెడ్డి లకు వైఎస్ షర్మిల ఫోన్ చేయడానికి.. అసలైన కారణం ఇదేనా?
తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాం చోటుచేసుకుంది. తాజాగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, టీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌లకు ఫోన్ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగుల విషయంలో కలిసి పోరాడదామని.. ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చెద్ధామని కోరారని తెలుస్తుంది.

Ys Sharmila : తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాం చోటుచేసుకుంది. తాజాగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, టీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌లకు ఫోన్ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగుల విషయంలో కలిసి పోరాడదామని.. ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చెద్ధామని కోరారని తెలుస్తుంది. అలాగే ప్రగతి భవన్ మార్చ్ (సీఎం హౌస్ మార్చ్) పిలుపు నిద్దామని సూచించారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ప్రతిపక్షాలు ఏకం కావాలని వైఎస్ షర్మిల పేర్కొన్నట్లు భావిస్తున్నారు. అయితే ఈ విషయంపై బండి సంజయ్ సానుకూలంగా స్పందించగా.. రేవంత్ రెడ్డి మాత్రం పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్టుగా తెలుస్తోంది.