Home / latest Telangana news
మల్కాజ్గిరి బిఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మంత్రి హరీష్ రావుపై ఫైరయ్యారు. హరీష్ రావు తన గతాన్ని గుర్తుంచుకోవాలని హనుమంతరావు హితవు పలికారు. తిరుమలలో శ్రీవారి దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసారు.
తెలంగాణ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ నేతలకు ఊహించని షాక్ తగిలింది. ఒక వైపు త్వరలో రానున్న ఎన్నికల కోసం పార్టీలన్నీ సిద్దమవుతున్న తరుణంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్.. రాసలీలల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వైరా మాజీ ఎమ్మెల్యే బానుకు మదన్ లాల్ ఓ యువతితో
హైదరాబాద్ నగరంలో తాజాగా మరో వంతెన ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందిరాపార్క్ నుండి ఆర్టీసీ క్రాస్ రోడు మీదుగా వీఎస్టీ వరకు స్టీల్ బ్రిడ్జిని నిర్మించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ బ్రిడ్జిని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవం చేశారు. 2.25 కిలోమీటర్లు ఉన్న ఈ ఫోర్ లైన్ స్టీల్ బ్రిడ్జికి.. మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ భారీ వర్షాలు రానున్నాయి. తాజాగా ఏపీ, తెలంగాణాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కాగా తెలంగాణలో భారీ వర్షాలు.. ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడన ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
హైదరాబాద్ లోని ఎల్బీ నగర్లో అర్ధరాత్రి మహిళను స్టేషన్‌కు తీసుకెళ్లి థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే విషయం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకాం.. హైదరాబాద్ మీర్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని వరలక్ష్మి నివాసముంటోంది. కొన్నేళ్ల క్రితమే భర్త చనిపోవడంతో కుటుంబాన్ని ఆమే పెద్దదిక్కుగా మారింది.
భారత 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై.. హైదరాబాద్ లోని రాజ్‌భవన్‌లో అట్‌హోమ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వారిలో ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ అయిన ప్రైమ్ 9 న్యూస్ సీఈఓ పైడికొండల వెంకటేశ్వరరావు కూడా హాజరయ్యారు.
1997లో ప్రజా గాయకుడు గద్దర్‌పై జరిగిన కాల్పుల ఘటనలో తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. కాల్పుల అనంతరం గద్దర్ తనతో పలుమార్లు మాట్లాడారని ఆయన స్పష్టం చేశారు. అల్వాల్‌లోని ప్రజా గాయకుడు గద్దర్ నివాసానికి వెళ్ళిన చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. గద్దర్ కుటుంబ సభ్యులని పరామర్శించారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ తమిళనాడును నీట్ నుండి మినహాయించకపోవడంపై కేంద్రంపై మండిపడ్డారు. విద్యను రాజ్యాంగంలోని రాష్ట్ర జాబితాకు మార్చితేనే NEET పరీక్షను తొలగించగలమని స్టాలిన్ అన్నారు.
హైదరాబాద్ శివార్లలోని హకీంపేటలో ఉన్న తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్లో లైంగిక వేధింపుల ఘటన ప్రకంపనలు సృష్టిస్తోంది. స్పోర్ట్స్ స్కూల్ ఓఎస్డీ హరికృష్ణపై లైంగిక వేధింపుల ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. దీనిపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు
కేసీఆర్, కేటీఆర్, బిఆర్ఎస్ని టార్గెట్ చేస్తూ కరీంనగర్ ఎంపి, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ట్విట్టర్లో ప్రశ్నల వర్షం కురిపించారు. మీ నిజ స్వరూపం బయటపడిందని భయపడుతున్నారని బండి సంజయ్ ట్వీట్ చేశారు. ప్రజలని దోచుకోవడం ద్వారా మీ ఆదాయం ఎలా పెరిగిందో అందరికీ తెలిసిపోయిందని బండి సంజయ్ అన్నారు.