Home / latest Telangana news
తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో సి కళ్యాణ్ ప్యానెల్‌పై దిల్ రాజు ప్యానెల్ హవా కొనసాగుతోంది. నిర్మాతల రంగంలోని మొత్తం 12 సీట్లలో ఇప్పుడు ఏడు దిల్ రాజుకు చెందినవే.14 రౌండ్లలో దిల్‌రాజుకు 563 ఓట్లు రాగా సి. కల్యాణ్‌కు 497 ఓట్లు వచ్చాయి. ప్రొడ్యూసర్ సెక్టార్ మొత్తం 12 స్థానాల్లో ఏడింటిలో దిల్‌రాజు ప్యానెల్ సభ్యులు గెలుపొందారు
దేశానికి సైనికులు ఎలాగో సమాజానికి డాక్టర్లు అలా సేవచేస్తున్నారని ప్రముఖ హీరో సుమన్ అన్నారు. ఆదివారం హైదరాబాద్ లోని లయన్స క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అభయ బంజారా 13వ వార్షికోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో డాక్టర్లు, నర్సులు తమ ప్రాణాలకు తెగించి సేవలు అందించారని అన్నారు.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కరీంనగర్ ఎంపి బండి సంజయ్‌ని నియమించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా కొత్త కార్యవర్గాన్ని ప్రకటించారు. ఇందులో 13 మంది ఉపాధ్యక్షులు, 9 మంది ప్రధాన కార్యదర్శులు, 13మంది కార్యదర్శులకి చోటు కల్పించారు. గద్వాలకి చెందిన డికె అరుణని ఉపాధ్యక్షురాలిగా కొనసాగించారు. ఏపీకి చెందిన సత్యకుమార్కి కార్యదర్శిగా చోటు దక్కింది.
తెలంగాణలో కురిసిన భారీ వర్షాలు రాష్ట్రంలో పెను విషాదాన్ని మిగిలిస్తున్నాయి. ఈ భారీ వర్షాల ధాటికి వందల మంది నిరాశ్రయులవ్వగా.. వరదల ధాటికి పలువురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ వరదల కారణంగా ఇప్పటి వారకు 23 మంది మృతి చెందగా.. మరో 9 మంది గల్లంతు అయ్యారని సమాచారం
బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకి వ్యతిరేకంగా సెజర్ చేస్తున్న ఆందోళన గురించి అందరికీ తెలిసిందే. అంతకు ముందు ఢిల్లీ వచ్చి జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్, సీబీఐకి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై శేజల్ ఫిర్యాదు చేసిన విషయం విధితమే. న్యాయం జరగకపోవడంతో తెలంగాణ భవన్లో ఆత్మహత్యాయత్నానికి
తెలంగాణలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రజల పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. మరో మూడ్రోజుల పాటు ఇలాగే భారీగానే వర్షాలు కురుస్తాయని శాఖ తెలిపింది. ఇక హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో రెడ్ అలర్ట్ ప్రకటించింది. మరోవైపు.. హైదరాబాద్‌లో పగలు రాత్రి తేడా లేకుండా
ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ముత్యాలధార జలపాతం వద్ద సందర్శనకు వెళ్లి పలువురు పర్యాటకులు చిక్కుకున్న విషయం తెలిసిందే. కాగా వీరిని సురక్షితంగా కాపాడేందుకు రంగం లోకి దిగిన ఎన్టీఆర్ఎఫ్ బృందాలు పర్యాటకులను సురక్షితంగా కాపడారు. బుధవారం అర్థరాత్రి తరువాత అడవిలో
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామస్తులు వరదలో చిక్కుకున్నారు. బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గ్రామంలోని మోరంచవాగు ఉగ్రరూపం దాల్చింది. దీంతో మోరంచపల్లి గ్రామం ముంపునకు గురైంది. ఇళ్లలోకి వరద నీరు రావడంతో భవనాలు, చెట్లపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు ఆకాశానికి చిల్లు పడిందా అనే అనే అనుమానం వస్తుంది. గత మూడు రోజులుగా ఏపీ తెలంగాణలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరి ముఖ్యంగా తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పోలీస్ శాఖ అప్రమత్తమయ్యింది.
సరదా కోసం తీసిన రీల్స్ యువతి ప్రాణాలకు ముప్పును తెచ్చింది. అర్థమయ్యేలా చెప్పాల్సిన అన్న ఆగ్రహంతో చెల్లిని హత్య చేసి కటకటాల్లోకి వెళ్లాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సోదరి మరో యువకుడితో కలిసి యూట్యూబ్ రీల్స్ చేస్తుందని ఆగ్రహంతో ఆమెతో వాదన పెట్టుకున్నాడు.