Home / latest Telangana news
కొద్ది రోజులుగా ఎండ, ఉక్కపోతతో సతమతమవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో ఈ రోజు నుంచి మంగళవారం వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
కోరుట్ల యువతి దీప్తి హత్య కేసులో మిస్టరీ వీడింది. చెల్లి చందనను హంతకురాలని పోలీసులు తేల్చారు. ఆమెతో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. తల్లిదండ్రులు ఇంట్లో లేనప్పుడు ప్రియుడు షేక్ ఉమర్ సుల్తాన్‌తో వెళ్ళిపోవడానికి నిర్ణయించుకుంది.
మాదాపూర్‌లో వెలుగులోకి వచ్చిన టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో ముగ్గురు నిందితులని పోలీసులు అరెస్ట్ చేశారు. సినీ ఫైనాన్షియర్ వెంకట రత్నారెడ్డి, బాలాజీ, మురళిని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. వీరినుంచి 33 లక్షల రూపాయల విలువైన మాదకద్రవ్యాలు, 72వేల ఐదు వందల రూపాయలు, రెండు కార్లు, ఐదు ఫోన్లని సీజ్ చేశారు.
హైదరాబాద్ నగరం నడిబొడ్డున మరోసారి డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతుంది. ఈ వ్యవహారంలో మల్లవ టాలీవుడ్ కి లింకు లు ఉండడం ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. మాదాపూర్ లోని విఠల్ రావ్ నగర్ ఫ్రెష్ లివింగ్ అపార్ట్ మెంట్ లో రేవ్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేసారు.
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల గురువారం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశం అయ్యారు ఈ భేటీ కోసం నిన్ననే.. భర్త అనిల్ తో కలిసి.. షర్మిల హస్తిన బయలుదేరి వెళ్లారు. అయితే వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారా..? లేక పార్టీతో పొత్తు పెట్టుకుంటారా అనేది ఆసక్తిగా మారింది.
హైదరాబాద్‌లోని మాదాపూర్ పరిధిలోని ఓ అపార్ట్మెంట్లో రేవ్‌పార్టీని నార్కోటిక్స్ బ్యూరో అధికారులు భగ్నం చేశారు. రేవ్ పార్టీని నిర్వహిస్తున్నారని సమాచారం అందుకున్న అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రేవ్ పార్టీలో పాల్గొన్న వారి నుంచి భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు
తెలంగాణలో ఉపాధ్యాయులకి హైకోర్టు శుభవార్త చెప్పింది. ఉపాధ్యాయుల బదిలీలకి తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే తుది తీర్పులకు లోబడి బదిలీలు ఉండాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. టీచర్ల బదిలీలపై గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులని హైకోర్టు సవరించింది.
జగిత్యాల జిల్లా కోరుట్లలో తన ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో మరణించిన బంకి దీప్తి కేసులో పోలీసులు దర్యాప్తుని ముమ్మరం చేశారు. సిసి కెమెరాలు, సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తు బృందాలు ముందుకు సాగుతున్నాయి.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన ప్రాణం ఉన్నంత వరకు తాను బీజేపీలోనే ఉంటానన్నారు. ఒకవేళ బీజేపీ తనపై సస్పెన్షన్ ఎత్తివేయకపోతే తాను కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటానన్నారు. తాను హిందువాదినని రాజాసింగ్ తెలిపారు.
ఖమ్మం జిల్లా నాయకన్ గూడెం వద్ద జరిగిన టీచర్ బైరోజు వెంకటాచారి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 15 లక్షలు సుపారీ ఇచ్చి కిరాయి హంతకులతో చంపించారని పోలీసుల విచారణలో తేలింది. నిందితుడిని హతుడు వెంకటాచారి స్నేహితుడు గిరిధర్ రెడ్డిగా నిర్థారించారు.