Home / latest Telangana news
తెలంగాణ మంత్రి వర్గంలోకి పట్నం మహేందర్ రెడ్డి చేరారు. గవర్నర్ తమిళి సై మంత్రి పట్నం మహేందర్ రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్భవన్లో సిఎం కెసిఆర్ సమక్షంలో పట్నం మహేందర్ రెడ్డితో గవర్నర్ తమిళిసై ప్రమాణం చేయించారు. అనంతరం సీఎం కేసీఆర్కు, గవర్నర్కు మంత్రి మహేందర్ రెడ్డి పుష్పగుచ్ఛాలు ఇచ్చారు.
హైదరాబాద్ లో మైనర్ బాలికపై అత్యాచారం కేసును రాచకొండ పోలీసులు చేధించారు. దీనికి సంబంధించి వివరాలను రాచకొండ పోలీస్ కమిషనర్ చౌహన్ మీడియాకు వెల్లడించారు.మీర్ పేట్ మైనర్ బాలిక పై హత్యాచారం చేసిన కేసు లో ఆరుగురిని ఆరెస్ట్ చేసామనిమరొక వ్యక్తి పరార్ లో ఉన్నాడని తెలిపారు. మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధి నందన వనం లో ఈ సంఘటన జరిగింది..
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్ దక్కకపోవడంతో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కన్నీరు పెట్టారు. అనుచరుల ముందు బోరున విలపించారు. వరంగల్ అంబేద్కర్ విగ్రహం ముందు పడుకుని ఏడ్చారు. వర్షంలో తడుస్తూ కాసేపు మౌనదీక్ష చేపట్టారు.రాజయ్యను చూసి కార్యకర్తలు కంటతడి పెట్టుకున్నారు. కేసీఆర్ గీసిన గీత దాటనని రాజయ్య తెలిపారు.
సామూహిక అత్యాచార బాధితురాలిని సంరక్షించాలి. నిందితులను కఠినంగా శిక్షించాలని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ అన్నారు. హైదరాబాద్ మీర్ పేట ప్రాంతంలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం ఘటన తీవ్రంగా కలచివేసిందన్నారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తన భవిష్యత్ కార్యాచరణని రేపు ప్రకటించనున్నారు. తన మనుమడి పుట్టు వెంట్రుకలని శ్రీవారి చెంత తీయించడానికే వచ్చానని మైనంపల్లి చెబుతున్నారు. మైనంపల్లి తిరుమలలో మరోసారి మీడియాతో మాట్లాడారు.
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్ రానున్న అసెంబ్లీ ఎన్నికలకు గాను 115 నియోజకవర్గాలకు తమ పార్టీ తరపున అభ్యర్థులను ప్రకటించారు. సోమవారం ఆయన బీఆర్ఎస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేవలం నాలుగు నియోజకవర్గాలను మాత్రమే పెండింగ్లో పెట్టామని, ఏడు స్థానాల్లో మాత్రమే సిట్టింగ్లను మార్చినట్లు చెప్పారు.
మల్కాజ్గిరి బిఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మంత్రి హరీష్ రావుపై ఫైరయ్యారు. హరీష్ రావు తన గతాన్ని గుర్తుంచుకోవాలని హనుమంతరావు హితవు పలికారు. తిరుమలలో శ్రీవారి దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసారు.
తెలంగాణ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ నేతలకు ఊహించని షాక్ తగిలింది. ఒక వైపు త్వరలో రానున్న ఎన్నికల కోసం పార్టీలన్నీ సిద్దమవుతున్న తరుణంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్.. రాసలీలల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వైరా మాజీ ఎమ్మెల్యే బానుకు మదన్ లాల్ ఓ యువతితో
హైదరాబాద్ నగరంలో తాజాగా మరో వంతెన ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందిరాపార్క్ నుండి ఆర్టీసీ క్రాస్ రోడు మీదుగా వీఎస్టీ వరకు స్టీల్ బ్రిడ్జిని నిర్మించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ బ్రిడ్జిని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవం చేశారు. 2.25 కిలోమీటర్లు ఉన్న ఈ ఫోర్ లైన్ స్టీల్ బ్రిడ్జికి.. మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ భారీ వర్షాలు రానున్నాయి. తాజాగా ఏపీ, తెలంగాణాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కాగా తెలంగాణలో భారీ వర్షాలు.. ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడన ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.