Last Updated:

Trending Video : మహారాష్ట్రలో ఘొరం.. రోడ్డును చేతులతో లేపేస్తున్న గ్రామస్థులు.. ట్రెండింగ్ గా మారిన వీడియో

Trending Video : సాధారణంగా రోడ్డుని క్రేన్ లతో తొలగించడం.. లేపడం గమనించవచ్చు. అయితే మహారాష్ట్రలోని జల్నా జిల్లా అంబాద్ తాలూకాలోని కర్జాత్-హస్త్ పోఖరీలో మాత్రం ఓ విచిత్రం జరుగుతుంది. ఇటీవల తాజాగా ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన (పీఎం రూరల్ రోడ్ స్కీమ్)లో రోడ్డును నిర్మించారు. అయితే నాణ్యతా లోపాల కారణంగా ఆ రోడ్డును గ్రామస్తులు ఉత్త చేతులతోనే పైకి లేపడం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ మేరకు ఈ వీడియోని ట్విట్టర్ లో పోస్ట్ చేయగా ఫుల్ ట్రెండింగ్ గా మారింది. ఈ నాసిరకం రోడ్డుకు అప్రూవల్ ఇచ్చిన ఇంజినీర్‌పై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.