Home / latest national news
జ్ఞాన్వాపి-శృంగర్ గౌరీ కేసులో హిందూఆరాధకుల పిటిషన్ ను సవాలు చేస్తూ ముస్లిం పక్షం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న అంజుమన్ ఇంతేజామియా కమిటీ పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు బుధవారం తోసిపుచ్చింది.
ప్రఖ్యాత ఉర్దూ కవి మహమ్మద్ ఇక్బాల్ ‘సారే జహాన్ సే అచ్ఛా’ను రచించడం ద్వారా దేశానికి సేవ చేశాడని, అయితే తాను దానిని అసలు నమ్మలేదని ఢిల్లీ యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్ యోగేష్ సింగ్ అన్నారు.
మణిపూర్‌లో చెలరేగిన హింసపై సీబీఐ విచారణ జరిపిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇండిజినస్ ట్రైబల్ లీడర్స్ ఫోరమ్ (ITLF) కార్యదర్శి మువాన్ టోంబింగ్ కు హామీ ఇచ్చారు. వచ్చే 15 రోజుల్లో విచారణ చేపడతామని, ప్రజలు శాంతియుతంగా ఉండాలని అమిత్ షా కోరారు.
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెజ్లర్లు తమ పతకాలను గంగలో నిమజ్జనం చేసేందుకు మంగళవారం హరిద్వార్ చేరుకున్నారు. సమస్య పరిష్కారానికి ఐదు రోజుల సమయం కావాలని రైతు నాయకులు కోరడంతో పథకం విరమించుకున్నారు.
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తోంది. 2022 జూలైలో పాట్నా పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని హతమార్చేందుకు నిషేధిత సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) పన్నిన కుట్రకు సంబంధించి బుధవారం నాటి ఎన్ఐఏ దాడులు జరిగాయి.
ఉత్తరాఖండ్ ప్రభుత్వం రాబోయే మూడు రోజుల పాటు కేదార్నాథ్ ధామ్‌ను సందర్శించడానికి కొత్త పర్యాటకుల రిజిస్ట్రేషన్లను నిలిపివేసింది. యాత్రకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు నమోదు చేసుకోవడంతో రద్దీని నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
తన ఖరీదైన ఫోన్‌ను తిరిగి పొందేందుకు రిజర్వాయర్ నుండి 42 లక్షల లీటర్ల నీటిని తోడించినందుకు ఛత్తీస్‌గఢ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అంతేకాదు రిజర్వాయర్ నుంచి ఐదు అడుగుల వరకు నీటిని తోడివేసేందుకు మౌఖిక అనుమతి ఇచ్చారని ఇన్స్పెక్టర్ పేర్కొన్న సీనియర్ అధికారిని బాధ్యులను చేశారు.
కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌తో నాలుగు గంటల పాటు సుదీర్ఘ సమావేశం అనంతరం ఆ పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ రాజస్థాన్‌లో కాంగ్రెస్ వర్గాలకతీతంగా ఐక్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తుందని ప్రకటించారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ ఇద్దరూ పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని అంగీకరించినట్లు వేణుగోపాల్ తెలిపారు.
ణిపూర్ ఘర్షణల్లో మరణించిన వారికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని కేంద్ర, మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. అల్లర్లలో మరణించిన వారి కుటుంబంలో ఒకరికి కూడా ఉద్యోగం కల్పిస్తామన్నారు.
భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నేటితో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుంది. బీజేపీ పదవీకాలం దేశానికి సేవగా భావించిన ప్రధాని మోదీ ప్రతి నిర్ణయం మరియు ప్రతి చర్య ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి రూపొందించబడినట్లు తెలిపారు.