Home / latest national news
డీఎంకేను వంశపారంపర్య పార్టీగా అభివర్ణించిన హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై తమిళనాడు క్రీడాశాఖ మంత్రి ఉంధయనిధి స్టాలిన్ ఘాటుగా స్పందించారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శిగా తన కుమారుడు జై షా స్దానాన్ని ఆయన ప్రశ్నించారు.
దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఒక సైనికుడు మాయమయ్యాడు. జమ్మూ మరియు కాశ్మీర్ లైట్ ఇన్ఫాంట్రీ రెజిమెంట్‌కు చెందిన రైఫిల్‌మ్యాన్ జావేద్ అహ్మద్ ఈద్ సందర్భంగా సెలవుపై ఇంటికి వచ్చాడు. అతను తిరిగి వచ్చి రేపు డ్యూటీలో చేరాల్సి ఉంది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా శ్రీహరికోట నుంచి PSLV-C 56 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. దీనిద్వారా 7 విదేశీ ఉపగ్రహాలను నిర్దేశిత కక్షలోకి పంపించారు. ఇందులో సింగపూర్‌కు చెందిన డీఎస్టీఏ ఎస్టీ ఇంజినీరింగ్ సంస్థకు చెందిన డీఎస్ ఎస్ఏఆర్ఉపగ్రహంతోపాటు నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీకి చెంచిన వెలాక్స్-ఏఎం, ఆర్కేట్, స్కూబ్-2, న్యూలియాన్, గెలాసియా-2, ఓఆర్బీ-12 శాటిలైట్లు ఉన్నాయి. ఇవన్నీ సింగపూర్‌కు చెందినవే కావడం విశేషం.
తమిళనాడులోని కృష్ణగిరిలోని బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించిన ఘటనలో ముగ్గురు మహిళలు సహా ఎనిమిది మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ పేలుడు కారణంగా సమీపంలోని ఓ హోటల్ భవనం కూలిపోగా, మరో నాలుగు భవనాలు పాక్షికంగా దెబ్బతినడంతో పలువురు చిక్కుకుపోయారు.పాతాయపేట లో ఉన్న ఈ బాణాసంచా తయారీ గోడౌన్లో తీవ్రంగా గాయపడిన 12 మందిని ఇప్పటివరకు ఆసుపత్రిలో చేర్చినట్లు పోలీసులు తెలిపారు.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో ప్రయోగానికి సిద్ధమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి రేపు ఉదయం 6.30 గంటలకు PSLV C-56 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. ఇక, దీనికి సంబంధించిన కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది.
కాంగ్రెస్ అగ్రనేల రాహుల్ గాంధీ హర్యానాలోని సోనిపట్ మహిళా రైతులతో తన సంభాషణల వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. ఇటీవల ఢిల్లీకి వచ్చిన మహిళా రైతులతో రాహుల్ గాంధీ, సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ సరదాగా ముచ్చటించడం ఈ వీడియోలలో చూడవచ్చు.
మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో వైరల్‌పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) శనివారం అధికారికంగా విచారణ చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకి వ్యతిరేకంగా సెజర్ చేస్తున్న ఆందోళన గురించి అందరికీ తెలిసిందే. అంతకు ముందు ఢిల్లీ వచ్చి జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్, సీబీఐకి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై శేజల్ ఫిర్యాదు చేసిన విషయం విధితమే. న్యాయం జరగకపోవడంతో తెలంగాణ భవన్లో ఆత్మహత్యాయత్నానికి
ఉత్తరప్రదేశ్‌లో కట్టుకున్న భర్తను.. భార్య ఐదు ముక్కలుగా నరికి కాలువలో విసిరేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. పిలిభిత్ లోని గుజ్రాలా ప్రాంతంలో గల శివ నగర్ లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివసిస్తున్న రాంపాల్ కు భార్య, కుమారుడు ఉన్నారు.
భారతదేశం తన గౌరవం మరియు గౌరవాన్ని కాపాడుకోవడానికి నియంత్రణ రేఖ (ఎల్ఓసి) దాటడానికి సిద్ధంగా ఉందని, అటువంటి పరిస్థితిలో సైనికులకు మద్దతు ఇవ్వడానికి పౌరులు సిద్ధంగా ఉండాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారంపిలుపునిచ్చారు