Home / latest national news
ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం కోర్బా జిల్లాలో నోట్లో బల్లి పడటంతో రెండున్నరేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఊహించని ఈ ఘటనతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే.. నాగిన్‌భాంఠా ప్రాంతానికి చెందిన రాజ్‌కుమార్ సందేకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.
మణిపూర్‌లో జరిగిన హింసాకాండపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు ప్లకార్డులు చేతబూని నినాదాలు చేయడంతో పార్లమెంట్ ఉభయ సభలు సోమవారం మళ్లీ వాయిదా పడ్డాయి. మణిపూర్ హింసాకాండపై పార్లమెంటులో గందరగోళం కొనసాగుతుండగా, ప్రతిపక్షాలు ప్రధానమంత్రి సభ వెలుపల ఎందుకు మాట్లాడుతున్నారు కాని లోపల ఎందుకు మాట్లాడుతున్నారని మండిపడ్డాయి.
కాలం మారుతుంది.. కానీ దేశంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తుంటే ఇంకా ప్రజలు ఎందుకు ఇలా చేస్తున్నారు అనే ప్రశ్న ప్రతి ఒక్కరికీ తలెత్తుతుంది. 2023 లో సగం సంవసారం పూర్తి అయిపోయింది కానీ ఇంకా మనుషుయులు తోటి మనుషులను కుల, మత, వర్ణ, వర్గ విభేదాలతో దూరం పెట్టడం..
రాజస్దాన్ మంత్రివర్గం నుంచి తొలగించబడిన మంత్రి రాజేంద్ర సింగ్ గూడా సోమవారం రాజస్థాన్ అసెంబ్లీ లో 'రెడ్ డైరీ'తో కలకలం సృష్టించారు.అందులో రాష్ట్ర ప్రభుత్వం రూ. 100 నుండి 500 కోట్ల వరకు చేసిన అక్రమ లావాదేవీల రికార్డులు ఉన్నాయి. ఆదాయపన్ను శాఖ దాడుల్లో ఉన్న మంత్రి ధర్మేంద్ర రాథోడ్ ప్రాంగణంలో ఉన్న 'రెడ్ డైరీ'ని వెలికితీసేందుకు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తనను పలుమార్లు సంప్రదించారని గుధా సంచలన వ్యాఖ్యలు చేసారు.
న్యూఢిల్లీకి చెందిన ఒక వివాహిత తన ప్రేమికుడిని కలవడానికి పాకిస్థాన్‌కు వెళ్లింది. అయితే, ఎలాంటి చెల్లుబాటు అయ్యే ప్రయాణ పత్రాలు లేకుండా భారత్‌లోకి చొరబడిన సీమా హైదర్‌లా కాకుండా, వీసాపై అధికారులు అంజుకి పాకిస్తాన్లోకి ప్రవేశం కల్పించారు.ఆమె వాఘా మార్గంలో పాకిస్తాన్ చేరుకుని అక్కడనుంచి ఇస్లామాబాద్ కు చేరుకుందని ఆజ్ న్యూస్ నివేదించింది
వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదులో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) సర్వేను రెండు రోజుల పాటు నిలిపివేసింది సుప్రీంకోర్టు. కాశీ విశ్వనాథ దేవాలయం పక్కనే ఉన్న చారిత్రాత్మక మసీదు సముదాయంలో సర్వే తవ్వకానికి దారితీస్తుందనే భయంతో మసీదు నిర్వహణ కమిటీ కేంద్రాన్ని సంప్రదించింది.
: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అరుదైన ఘనత సాధించారు. దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రి పదవిలో కొనసాగిన రెండో వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసును వెనక్కి నెట్టి ఆయన ఈ ఘనత సాధించారు. అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు ఇప్పటికీ సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ పేరిటే ఉన్నది
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో తన భార్య పెర్ఫ్యూమ్ కొట్టుకుని బయటికి వెళుతుండగా గొడవపడి ఓ వ్యక్తి కాల్చిచంపాడు. తీవ్రంగా గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, ఘటన అనంతరం వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు.
దివంగత మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు రామకృష్ణ అలియాస్ ఆర్కే భార్య శిరీషని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఎ అధికారులు అరెస్ట్ చేశారు. ఏపీలోని టంగుటూరు మండలం ఆలకూరుపాడులో నివసిస్తున్న ఆర్కే భార్య శిరీష నివాసంలో శుక్రవారం ఉదయంనుంచి ఎన్ఐఎ అధికారులు సోదాలు నిర్వహించారు. సాయంత్రంపూట శిరీషని అరెస్ట్ చేశారు
పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో కొద్ది రోజుల క్రితం ఇద్దరు గిరిజన మహిళలను వివస్త్రను చేసి చిత్రహింసలకు గురి చేశారని బీజేపీ శనివారం ఆరోపించింది. మే 4 మణిపూర్ వీడియోపై ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ వీడియో క్లిప్ వచ్చింది.