Donald Trump: అమెరికా విద్యాశాఖ మూసివేత.. ఉత్తర్వులపై సంతకం చేసిన డొనాల్డ్ ట్రంప్

Donald Trump Signs Order To Shut Down US Education Department: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు మార్పులు తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వ ఖర్చులకు సంబంధించి వ్యయం తగ్గింపులపై ప్రత్యేక దృష్టి సారించిన ట్రంప్.. విద్యాశాఖను మూసివేశారు. కాగా, ఇటీవల విద్యాశాఖలో భారీగా ఉద్యోగాల్లో కోతలు విధించారు.
కాగా, అమెరికా విద్యాశాఖ మూసివేత ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. అయితే, విద్యార్థులకు ఫీజుల రాయితీలు, కొన్ని ముఖ్యమైన పథకాలు కొనసాగిస్తామని ట్రంప్ తెలిపారు. నాలుగు దశాబ్దాలుగా భారీగా ఖర్చు చేస్తున్నా విద్యా ప్రమాణాలు మెరుగపడటం లేదన్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ వెల్లడించారు.