Last Updated:

Sejal Issue : మరోసారి ఢిల్లీలో శేజల్ ఆందోళన.. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను సస్పెండ్ చేయాలంటూ

బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకి వ్యతిరేకంగా సెజర్ చేస్తున్న ఆందోళన గురించి అందరికీ తెలిసిందే.  అంతకు ముందు ఢిల్లీ వచ్చి జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్, సీబీఐకి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య‌పై శేజల్ ఫిర్యాదు చేసిన విషయం విధితమే. న్యాయం జరగకపోవడంతో తెలంగాణ భవన్‌లో ఆత్మహత్యాయత్నానికి

Sejal Issue : మరోసారి ఢిల్లీలో శేజల్ ఆందోళన.. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను సస్పెండ్ చేయాలంటూ

Sejal Issue : బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకి వ్యతిరేకంగా సెజర్ చేస్తున్న ఆందోళన గురించి అందరికీ తెలిసిందే.  అంతకు ముందు ఢిల్లీ వచ్చి జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్, సీబీఐకి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య‌పై శేజల్ ఫిర్యాదు చేసిన విషయం విధితమే. న్యాయం జరగకపోవడంతో తెలంగాణ భవన్‌లో ఆత్మహత్యాయత్నానికి సైతం ఆమె పాల్పడింది. గతంలో కేటీఆర్, బీఆర్ఎస్ ఎంపీల దృష్టికి తన సమస్యను శేజల్ తీసుకెళ్లింది. తాజాగా ఇప్పుడు మరోసారి ఢిల్లీ వేదికగా నిరసన తెలియజేసింది.

ఈ మేరకు పార్లమెంట్ భవనం ఎదుట తనకు న్యాయం చేయాలంటూ ఆమె నిరసనకు దిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను లైంగికంగా వేధించారని, మోసం చేశారని, తనకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను పార్టీ నుండి సస్పెండ్ చేసి తక్షణమే చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని శేజల్ డిమాండ్ చేసింది. దుర్గం చిన్నయ్య మీద కేసు నమోదు చేసే వరకు నా పోరాటం ఆగదని స్పష్టం చేసింది.

అలానే ఆమె మాట్లాడుతూ.. పేరుకు మాత్రమే చట్టాలు.. ఆడపిల్లకి న్యాయం చేయలేని చట్టాలు ఎందుకని ప్రశ్నించింది. మణిపూర్‌లో మహిళలపై జరిగిన ఘటన చాలా బాధాకరమని శేజల్ పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంకు సొంత రాష్ట్రంలో మహిళ‌పై జరిగిన విషయం మీద స్పందించే సమయం లేదు.. కానీ, పక్క రాష్ట్రాలలో జరిగిన ఘటనలమీద మాత్రం క్షణాల్లో స్పందించి రాజకీయాలు చేసుకోవడం పరిపాటిగా మారిందంటూ శేజల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళల లైంగిక వేధింపులకు సంబంధించి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మీద ఎఫ్ఐఆర్ ఇవ్వమని పోలీస్ స్టేషన్‌కి వెళ్తే ఎఫ్ఐఆర్ ఇవ్వకుండనే నా మీద తిరిగి తప్పుడు కేసులు పెడతామని బెదిరిస్తున్నారని శేజల్ ఆరోపించింది.