Home / latest national news
ఆస్కార్ బహుమతి పొందిన డాక్యుమెంటరీ 'ది ఎలిఫెంట్ విస్పరర్స్'లో నటించిన బెల్లిని , తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రంలో మొదటి మహిళా కేర్‌టేకర్‌గా నియమించింది. బెల్లి నీలగిరి జిల్లాలోని తెప్పక్కడు ఏనుగుల శిబిరంలో మావటికి సహాయకురాలిగా నియమించబడింది.
ప్రభుత్వ ఆస్పత్రుల గురించి సాధారణంగా అందరూ చెప్పే మాట ఏంటి అంటే.. ఉన్న రోగాలు తగగడం తర్వాత విషయం కొత్త వాటిని రాకుండా చేస్తే చాలు. ఎందుకంటే ప్రభుత్వాలు జీతాలు ఇస్తున్నాయి.. ప్రశ్నించే వారు లేరు అనే అహంకారంతో చాలా వరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మనం గమనిస్తే జరిగే విషయం ఒక్కటే.. నిర్లక్ష్యం.
హర్యానాలోని నుహ్ మరియు రాష్ట్రంలోని మరికొన్ని ప్రదేశాలలో మొబైల్ ఇంటర్నెట్ మరియు ఎస్ఎంఎస్ సేవలను గురువారం మధ్యాహ్నం ఒంటిగంటనుండి మూడు గంటలపాటు పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు.మత ఘర్షణల నేపథ్యంలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఉండేందుకు ఆగస్టు 5 వరకు ఇంటర్నెట్ ఆంక్షలు విధించారు.
జ్ఞానవాపి మసీదులో సర్వేకు అలహాబాద్ హైకోర్టు అనుమతి ఇచ్చింది. అంజుమన్ ఇంతెజామియా దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. సర్వేకు అనుకూలంగా జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. దీనితో మసీదు కాంప్లెక్స్‌లో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే చేయనుంది.
31 మంది ప్రతిపక్ష ఎంపీల బృందం బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయింది. మణిపూర్ లో కొనసాగుతున్న సంక్షోభంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ ఆమెకు మెమారాండం అందజేసింది. వీరిలో ఇటీవల మణిపూర్ లో పర్యటించిన ఎంపీలు కూడా ఉన్నారు.
లోకసభ స్పీకర్ ఓం బిర్లా తీవ్రమనస్తాపం చెందారు. లోకసభలో అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యుల ప్రవర్తనతో ఆయన విసుగు చెందారు. సభను సజావుగా సాగనీయకుండా అడుగడుగునా అడ్డుతగలడంతో ఆయన సభకు రాకుండా ముఖం చాటేశారు. సభ్యుల తీరులో మార్పు వచ్చే వరకు తాను సభలకు హాజరుకాబోనని తన సన్నిహితులకు చెప్పారని తెలిసింది.
హర్యానాలోని నుహ్ జిల్లాలో రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య ఆరుకు చేరింది. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ విశ్వహిందూ పరిషత్ ( వీహెచ్‌పీ) ఊరేగింపుపై దాడిని పెద్ద కుట్రలో భాగమని అభివర్ణించారు. మరోవైపు వీహెచ్‌పీ జాతీయ దర్యాప్తు సంస్ద ద్వారా విచారణకు డిమాండ్ చేసింది.
తనకు ప్రదానం చేసిన లోకమాన్య తిలక్ జాతీయ అవార్డు పురస్కారం మొత్తాన్ని నమామి గంగే ప్రాజెక్టుకు విరాళంగా ఇస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. మంగళవారం పూణేలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని చెప్పారు. నేను బహుమతి డబ్బును నమామి గంగే ప్రాజెక్టుకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఈ అవార్డును దేశంలోని 140 కోట్ల మంది ప్రజలకు అంకితం చేయాలనుకుంటున్నానని మోదీ అన్నారు.
మణిపూర్ హింసాకాండపై లోక్‌సభలో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఆగస్టు 8 నుంచి ఆగస్టు 10 వరకు చర్చ జరగనుంది.ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 10న సమాధానం ఇవ్వనున్నారు.జూలై 26న ప్రతిపక్ష పార్టీల తరపున కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
హర్యానాలోని నుహ్‌లో విశ్వహిందూ పరిషత్ (VHP) చేపట్టిన మతపరమైన ఊరేగింపు సందర్భంగా సోమవారం జరిగిన ఘర్షణల్లో ఇద్దరు హోంగార్డులు, ఒక పౌరుడు మరియు ఒక ఇమామ్‌తో సహా నలుగురు వ్యక్తులు మరణించారు మరియు అనేక మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారు.