Home / latest national news
పాకిస్తాన్ లో ఎన్నికల నిర్వహణ కోసం ఆ దేశ ఆర్థిక మంత్రిత్వ శాఖ వద్ద నిధులు లేవని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చెప్పారు. సమాచార మంత్రి మర్రియం ఔరంగజేబ్‌తో కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో అంతర్జాతీయ మీడియాను ఉద్దేశించి ఆసిఫ్ ఈ విషయాన్ని వెల్లడించారు.
‘ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతూనే ఉంటా. అదానీ వ్యవహారంలో స్పీకర్ కు అన్ని ఆధారాలను సమర్పించాను. లండన్ పర్యటన పై మంత్రులు తప్పుడు ప్రచారం చేశారు.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై 2019 పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు గురువారం 2 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ కేసు అతని వివాదాస్పద ‘మోదీ ఇంటిపేరు’ వ్యాఖ్యకు సంబంధించినది. ఇది అతనిపై కేసు నమోదు చేయడానికి దారితీసింది.
త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు 124 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. జాబితా ప్రకారం, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డి కె శివకుమార్ కనకపుర నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నారు.
రెండేళ్ల జైలు శిక్ష ఖరారైన నైపధ్యంలో రాహుల్ లోక్ సభ సభ్యత్వం రద్దు చేస్తూ లోక్ సభ సెక్రటేరియట్ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసి సంచలన నిర్ణయం తీసుకుంది.
ఉద్యోగాల కోసం భూ కుంభకోణంలో విచారణలో భాగంగా బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ నేడు ఢిల్లీ సీబీఐ కార్యాలయం,అతని సోదరి మీసా భారతి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరయ్యారు. మేము ఎల్లప్పుడూ ఏజెన్సీలతో సహకరిస్తాము
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో రూ.1,780 కోట్ల విలువైన 28 అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా శుక్రవారం తన ప్రసంగంలో మహాత్మా గాంధీకి ఒక్క యూనివర్సిటీ డిగ్రీ కూడా లేదని అన్నారు.గాంధీజీకి లా డిగ్రీ ఉందనే అపోహ ఉంది. అతనికి ఒక్క యూనివర్సిటీ డిగ్రీ కూడా లేదని మీకు తెలుసా? అతని ఏకైక అర్హత హైస్కూల్ డిప్లొమా అని మనోజ్ సిన్హా పేర్కొన్నారు
Priyanka Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం పట్ల ఆయన సోదరి ప్రియాంక గాంధీ స్పందించారు. ప్రధాని మోదీ దేశ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
ఈ ఆర్థిక సంవత్సరం నుండి సైనికులకు రేషన్‌లో తృణధాన్యాలు ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. 2023ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో సైనికులు తీసుకునే ఆహారం జీవన శైలి వ్యాధులను అరికట్టేవిధంగా మన భౌగోళిక వాతావరణ పరిస్దితులకు సరిపడే విధంగా ఉండాలని భావించారు.