Home / latest national news
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఢిల్లీలో జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాతో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక మరియు ప్రపంచ భాగస్వామ్యాలను మెరుగుపరచడంలో భాగంగా పలు అంశాలపై చర్చలు జరిపారు.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ఐసిఎంఆర్) H3N2 ఫ్లూ కేసులు మరియు కోవిడ్-19 ఇన్ఫెక్షన్ పెరుగుతున్న నేపథ్యంలో యాంటీబయాటిక్స్ వాడకం కోసం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
రాబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విశ్వాసం వ్యక్తం చేసారు. బీజేపీ పై ఐక్యంగా పోరాడాలని రాష్ట్రంలోని పార్టీ నాయకులకు ఆయన పిలుపునిచ్చారు.ఉత్తర కర్ణాటకలోని బెలగావిలో సోమవారం జరిగిన బహిరంగ ర్యాలీలో ఆయన ప్రసంగించారు.
కేరళకు చెందిన ట్రాన్స్‌వుమన్ పద్మ లక్ష్మి రాష్ట్ర బార్ కౌన్సిల్లో అడ్వకేట్‌గా నమోదు చేసుకోవడంతో కేరళలో మొదటి ట్రాన్స్ జెండర్ న్యాయవాది అయ్యారు. కేరళ బార్ కౌన్సిల్లో చేరిన 1500 మంది లా గ్రాడ్యుయేట్లలో ఆమె ఒకరు.
ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపిన సీజేఐ జస్టిస్ డి.వై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. పిటిషన్‌దారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
బీహార్‌లోని పాట్నా రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన టీవీ స్క్రీన్లపై అడల్ట్ ఫిల్మ్ ప్లే చేయడంతో అక్కడి ప్రజలు షాక్‌కు గురయ్యారు. ఆదివారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. స్టేషన్‌లోని టీవీ స్క్రీన్లపై ప్రకటనలకు బదులుగా అడల్ట్ ఫిల్మ్ ప్లే చేయడం ప్రారంభించడంతో కంగారు పడిన స్టేషన్‌లోని ప్రజలు ప్రభుత్వ రైల్వే పోలీస్ (GRP), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF)కి ఫిర్యాదు చేశారు.
ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ నివాసాన్ని సందర్శించిన కొన్ని గంటల తర్వాత ఆయన నాలుగు పేజీల ప్రాథమిక సమాధానాన్ని సమర్పించారు. మరో 8-10 రోజులలో వివరంగా ప్రతిస్పందిస్తానని తెలిపారు.
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం న్యూఢిల్లీ-అజ్మీర్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను తనిఖీ చేసి ప్రయాణికుల నుండి అభిప్రాయాన్ని తీసుకున్నారు.రైలులో ఉన్న వారితో తన ప వీడియోను పంచుకుంటూ, వైష్ణవ్ ఇలా రాసారు.
ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆస్పత్రిని సందర్శించిన ఆయన క్షతగాత్రులను పరామర్శించారు. ఈ ప్రమాదంపై ఒక కమిటీ వేశారు.
అయోధ్య లో నిర్మాణంలో ఉన్న రామమందిరం యొక్క తాజా చిత్రాలు ఇంటర్నెట్లో వైరల్ గా మారాయి. ఈ చిత్రాలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి ట్విట్టర్లో పంచుకున్నారు. ఆలయ పనులు 2024లో పూర్తికానుండగా, ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్‌గా మారాయి.