Home / latest national news
శాంతిభద్రతల మెరుగుదల కారణంగా అస్సాం, నాగాలాండ్ మరియు మణిపూర్‌లో AFSPA(సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం) కింద కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించిన ప్రాంతాల సంఖ్యను తగ్గించినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్విట్టర్లో తెలిపారు
:జమ్మూ కాశ్మీర్‌లోని చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన త్వరలో అందుబాటులోకి రానుంది. పారిస్ ఈఫిల్ టవర్ కంటే ఎత్తులో ఉన్న ఈ రైల్వే వంతెన, నదికి 359 మీటర్ల ఎత్తులో చీనాబ్ నదిపై విస్తరించి ఉంది.
పార్లమెంటు సభ్యుడిగా లోక్‌సభకు అనర్హత వేటు పడిన కొద్ది రోజుల తర్వాత, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆదివారం తన ట్విట్టర్ బయోడేటాని మార్చారు. రాహుల్ గాంధీ తన ట్విట్టర్ ఖాతా బయోడేటాని 'డిస్' క్వాలిఫైడ్ ఎంపీ'గా అప్డేట్ చేశారు
శ్రీహరి కోట నుంచి నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్.. వన్ వెబ్‌కు చెందిన 36 ఉప గ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. అంతరిక్ష ఆధారిత ఇంటర్నెట్ను ప్రపంచం మొత్తానికి అందించే శాటిలైట్స్‌ను ఇస్రో అంతరిక్షంలోకి పంపించింది. శ్రీహరికోటలోని షార్ సెంటర్ నుంచి 36 ఉపగ్రహాలతో కూడిన సముదాయాన్ని ప్రత్యేకంగా రూపొందించిన లాంచ్ వెహికల్ మార్క్ త్రీ భూకక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
ప్రస్తుతం ఉన్న టోల్ ప్లాజాల స్థానంలో జీపీఎస్ ఆధారిత పన్ను వసూళ్ల విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. వచ్చే 6 నెలల్లో జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్‌లతో సహా కొత్త సాంకేతికతలను ప్రభుత్వం ప్రవేశపెడుతుందని కేంద్రమంత్రి గడ్కరీ చెప్పారు.
:కార్తికి గోస్నాల్వ్స్ యొక్క ది ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీ బెస్ట్ షార్ట్‌గా ఆస్కార్ అవార్డును గెలుచుకున్నప్పటి నుండి, బొమ్మన్ మరియు బెల్లీ దంపతులు వార్తల్లో నిలిచారు. రఘు అనే అనాథ ఏనుగు పిల్లను చూసుకున్న జంట గా వారు మిలియన్ల మంది హృదయాలను గెలుచుకున్నారు.
మధ్యప్రదేశ్‌లో,విద్యుత్ బిల్లులను రికవరీ చేసేందుకు వివిధ జిల్లాల్లో డిఫాల్టర్ల మోటర్‌బైక్‌లు, నీటి పంపులు, ట్రాక్టర్లు మరియు గేదెలను కూడా విద్యుత్ శాఖ జప్తు చేస్తోంది.గురువారం, గ్వాలియర్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు డెయిరీ ఆపరేటర్ బాల్ కృష్ణ పాల్ ఇంటికి చేరుకుని, అతని వద్ద ఉన్న గేదెను స్వాధీనం చేసుకున్నారు.
పంజాబ్ కు చెందిన ఆప్ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ శనివారం ఐపీఎస్ అధికారి జ్యోతి యాదవ్‌ను వివాహం చేసుకున్నారు. పంజాబ్‌లోని రూప్‌నగర్ జిల్లాలోని గురుద్వారాలో వివాహ వేడుక జరిగింది.
రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్ బుధవారం ఢిల్లీ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్‌కు లేఖ రాశారు. తమ బెయిల్ బాండ్ల కోసం చెల్లించలేని ఖైదీలు మరియు వారి కుటుంబాల సంక్షేమం కోసం తాను రూ. 5.11 కోట్ల డిమాండ్ డ్రాఫ్ట్‌ను అందిస్తానని దీనికి అనుమతి ఇవ్వాలని కోరారు.
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం కర్ణాటక పర్యటించారు. తన పర్యటన సందర్భంగా చిక్కబళ్లాపూర్, బెంగుళూరు మరియు దావణగెరెలలో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాలలో ప్రధాని పాల్గొన్నారు. అంతేకాదు బెంగుళూరు మెట్రో ఫేజ్ 2 యొక్క కొత్త సెక్షన్‌ను కూడా మోదీప్రారంభించారు.