Home / latest national news
తన ముఖంపై త్రివర్ణ పతాకాన్ని చిత్రించుకున్న ఒక యువతికి పంజాబ్‌లోని అమృత్సర్ గోల్డెన్ టెంపుల్‌లోకి ప్రవేశించకుండా అడ్డుకున్నవీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు ఫైర్ అయ్యారు.
ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన మరియు అమలులో అవకతవకలు జరిగాయని ఆరోపించిన కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) ముందు హాజరయ్యారు
ఉత్తరప్రదేశ్ లో శనివారం కాల్చి చంపబడిన అతిక్ అహ్మద్ 2008లో పార్లమెంట్ సభ్యుడిగా తన ఓటుతో మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని కాపాడారా? అంటే అవుననే తెలుస్తోంది. రాజేష్ సింగ్ రచించిన మరియు రూపా పబ్లికేషన్స్ ప్రచురించిన పుస్తకం బాహుబలిస్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్: ఫ్రమ్ బుల్లెట్ టు బ్యాలెట్.. యుపిఎ ప్రభుత్వాన్ని పతనం నుండి రక్షించిన వారిలో అతిక్ అహ్మద్ ఉన్నారని చెబుతోంది.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్ ఆదివారం ఎమ్మెల్యే పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. బీజేపీ నాయకత్వం తనను అవమానించిందని ఆరోపించిన ఆయన, స్వతంత్రంగా పోరాడాలా లేక పార్టీతో కలిసి పోరాడాలా అనేదానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.
అతిక్ అహ్మద్ కొడుకు ఒక్కడే కాదు. యోగి ఆదిత్యనాధ్ ఉత్తరప్రదేశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన 6 సంవత్సరాలలో, ఉత్తర ప్రదేశ్ 10000 పోలీసు ఎన్కౌంటర్లను నమోదు చేసింది
ఉత్తరప్రదేశ్ లో గ్యాంగ్ స్టర్ నుంచి రాజకీయనాయుడిగా మారిన అతిక్ అహ్మద్ మరియు అతని సోదరుడు అష్రఫ్‌లు ఐదు రోజుల పోలీసు రిమాండ్‌లో కోర్టు నిర్దేశించిన వైద్య పరీక్షల కోసం వెడుతుండగా శనివారం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కాల్చి చంపబడ్డారు.
అతిక్ అహ్మద్ మరియు అతని సోదరుడు అష్రఫ్‌లను హతమార్చిన దుండగుల్లో ఒకరైన లవ్లేష్ తివారీ తండ్రి యజ్ఞ తివారీ, తన కొడుకు ఉద్యోగం లేదని, మరియు మాదకద్రవ్యాలకు బానిస అని చెప్పాడు.
ఎండలో, ఇసుకలో విశ్రాంతి తీసుకోవడానికి మరియు చల్లని బీరును ఆస్వాదించడానికి, పాండిచ్చేరి చాలా కాలంగా ఇష్టమైన పర్యాటక కేంద్రంగా ఉంది. ఈ నగరం యొక్క పర్యాటకాన్ని విస్తరించే ప్రయత్నంలో, కాటమరాన్ బ్రూయింగ్ కో. పట్టణాన్ని అన్వేషించే పర్యాటకులకు ప్రత్యేకమైన అనుభూతిని అందించే 'బీర్ బస్'ను ప్రారంభించింది.
హుగ్లీ నది కింద కోల్‌కతా మెట్రో ట్రయల్ రన్‌పై ప్రధాని నరేంద్ర మోదీ శనివారం సంతోషం వ్యక్తం చేశారు.కోల్‌కతా మెట్రో యొక్క మొదటి రేక్ హౌరా మైదాన్‌కు చేరుకుంది మరియు దీనిని ప్రయోగాత్మకంగా హుగ్లీ నది కింద సొరంగం ద్వారా నిర్వహించినట్లు అధికారులు బుధవారం తెలిపారు.
నన్ను దొంగ, ఆర్థిక నేరగాడని విమర్శించారు. మీరు కూడా అందులో భాగస్వాములే. దమ్ముంటే నాతో చాట్ సంబాషణలపై సీఐడీ, ఈడీలతో విచారణ జరిపించాలి.