Home / latest national news
ప్రధాని నరేంద్ర మోదీ రేడియో షో ‘మన్ కీ బాత్’ నేటితో 100 ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్‌ను ప్రారంభిస్తూ ప్రధాని మోదీ విజయదశమి మాదిరిగానే మన్ కీ బాత్ కూడా భారతీయుల మంచితనం, ఆశావాదం, సానుకూలత మరియు ప్రజల భాగస్వామ్యాన్ని జరుపుకునే సందర్భం అని అన్నారు.
పంజాబ్‌లోని లూథియానాలోని ఒక ఫ్యాక్టరీలో ఆదివారం గ్యాస్ లీకేజీ ఘటనలో 11 మంది మృతి చెందగా, 11 మంది ఆసుపత్రి పాలయ్యారు.ఈ ఘటన గియాస్పురా ప్రాంతంలో చోటుచేసుకుంది
గ్యాంగ్ స్టర్-పొలిటీషియన్ అతిక్ అహ్మద్ లాగే తనను కూడా కాల్చి చంపేస్తారేమో అని భయంగా ఉందని ఉత్తరప్రదేశ్ లోని సమాజ్ వాదీ పార్టీకి చెందిన సీనియర్ నేత ఆజం ఖాన్ ఆందోళన వ్యక్తం చేశారు. రాంపూర్ మున్సిపాలిటీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి ఫాతిమా జాబీ తరఫున ఆయన ప్రచారం చేశారు.
ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల అధిపతులు, డైరెక్టర్ల పదవులకు ఎంపికలు జరిపే ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్ బ్యూరో మొహంతిని
ఢిల్లీ మెట్రోలో ఒక వ్యక్తి తన ఫోన్ చూస్తూ హస్తప్రయోగం చేస్తూ కనిపించిన వీడియో వైరల్ గా మారింది. దీనితో మెట్రో రైలులో మహిళల భద్రతపై నెటిజన్లు ప్రశ్నించడం ప్రారంభించారు. దీనిని ఢిల్లీ మహిళా కమీషన్, ఢిల్లీ మెట్రో రైల్ సీరియస్ గా తీసుకున్నాయి.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఫిర్యాదు చేసిన రెజ్లర్ల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదిస్తున్నారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై 40 కేసులు ఉన్నాయని సిబల్ చెప్పారు.
ప్రధాని మోదీపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే చేసిన ‘విష సర్పం’పై స్పందించిన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ శుక్రవారం కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీని ‘విషకన్య‘గా అభివర్ణించారు. తన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు.
ఎల్గార్ పరిషత్-మావోయిస్ట్ లింకుల కేసులో గృహనిర్బంధంలో ఉన్న కార్యకర్త గౌతమ్ నవ్లాఖా తన భద్రత కోసం పోలీసు సిబ్బందిని అందుబాటులో ఉంచడానికి ఖర్చుగా మరో రూ.8 లక్షలు డిపాజిట్ చేయాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది
బాలీవుడ్ యువకథానాయిక జియా ఖాన్ కేసులో నటుడు సూరజ్ పంచోలికి ఊరట దక్కింది. సరైన సాక్ష్యాలు లేనందున ఈ కేసునుంచి సూరజ్ పంచోలికి విముక్తి కల్పిస్తున్నట్లు ముంబై సిబిఐ ప్రత్యేక కోర్టు ప్రకటించింది. 2013లో దేశవ్యాప్తంగా ఈ కేసు సంచలనం సృష్టించింది.
మణిపూర్‌లోని చురచంద్‌పూర్ జిల్లా న్యూ లమ్కాలో శుక్రవారంముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ కార్యక్రమానికి హాజరుకావాల్సిన వేదికను గుంపు ధ్వంసం చేసి, తగులబెట్టడంతో సమావేశాలు నిషేధించబడ్డాయి.మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేయబడ్డాయి.