Last Updated:

Azam Khan : అతిక్ అహ్మద్ లాగే నన్నూ చంపేస్తారని భయమేస్తోంది – సమాజ్ వాదీ పార్టీ నేత ఆజంఖాన్

గ్యాంగ్ స్టర్-పొలిటీషియన్ అతిక్ అహ్మద్ లాగే తనను కూడా కాల్చి చంపేస్తారేమో అని భయంగా ఉందని ఉత్తరప్రదేశ్ లోని సమాజ్ వాదీ పార్టీకి చెందిన సీనియర్ నేత ఆజం ఖాన్ ఆందోళన వ్యక్తం చేశారు. రాంపూర్ మున్సిపాలిటీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి ఫాతిమా జాబీ తరఫున ఆయన ప్రచారం చేశారు.

Azam Khan : అతిక్ అహ్మద్ లాగే నన్నూ చంపేస్తారని భయమేస్తోంది – సమాజ్ వాదీ పార్టీ నేత ఆజంఖాన్

Azam Khan : గ్యాంగ్ స్టర్-పొలిటీషియన్ అతిక్ అహ్మద్ లాగే తనను కూడా కాల్చి చంపేస్తారేమో అని భయంగా ఉందని ఉత్తరప్రదేశ్ లోని సమాజ్ వాదీ పార్టీకి చెందిన సీనియర్ నేత ఆజం ఖాన్ ఆందోళన వ్యక్తం చేశారు. రాంపూర్ మున్సిపాలిటీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి ఫాతిమా జాబీ తరఫున ఆయన ప్రచారం చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆజం ఖాన్ చాలా కాలం తర్వాత యూపీలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అందులో భాగంగా రాంపూర్ లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూపీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.

తన రాజకీయ ప్రత్యర్థులను ‘రాజకీయ నపుంసకులు’ అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. మున్సిపాలిటీ కాంట్రాక్ట్ లో ఉందని, దేశం మొత్తాన్ని కాంట్రాక్ట్ లో పెట్టారని ఆయన ఆరోపించారు. ఎర్రకోటను అమ్మేశారు,  విమానాశ్రయాలను అమ్మేశారు, పోర్టులు అమ్మేశారు, రైల్వేలు అమ్మేశారు.. ఇంకా ఏం మిగిలింది? ఇక మిగిలింది సైన్యం మాత్రమే. అది హుకుమత్-ఎ-హింద్ తోనే ఉండాలి. మన సైన్యం, ప్రభుత్వ సైన్యం రెండు వేర్వేరు విషయాలు. మా సైన్యం నీది, ఈ సైన్యం అడుగడుగునా పోరాడి విజయం సాధించడం చూశాం’’ అని ఆజం ఖాన్ అన్నారు. మేము మా ఓటు వేస్తాం.. అది మా జన్మహక్కు, కానీ అది కూడా మా నుండి రెండుసార్లు లాక్కున్నారు. మళ్లీ మూడో సారి లాక్కుంటే ఇక ఊపిరి పీల్చుకునే హక్కు కూడా ఉండదు. అని ఆయన తన అనర్హతను ప్రస్తావిస్తూ అన్నారు.

కాగా గతంలో రాంపూర్ సదర్ నియోజకవర్గం నుంచి ఆజం  ఖాన్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే విద్వేషపూరిత ప్రసంగం కేసులో కోర్టు ఖాన్ కు మూడేళ్ల జైలు శిక్ష విధించడంతో ఆయనపై అనర్హత వేటు వేస్తున్నట్లు రాష్ట్ర అసెంబ్లీ సెక్రటేరియట్ అక్టోబర్ లో ప్రకటించింది. 2019 ఏప్రిల్ లో రాంపూర్లో జరిగిన ఎన్నికల సభలో ప్రధాని నరేంద్ర మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ పై తీవ్ర ఆరోపణలు చేసినందుకు ఇమ్రాన్ ఖాన్ పై కేసు నమోదు అయ్యింది. అయితే వక్ఫ్ బోర్డు ఆస్తుల భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకున్న కేసులో అలహాబాద్ హైకోర్టు 2022 మేలో ఆజం ఖాన్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

ఉత్తరప్రదేశ్‌లోని 75 జిల్లాల్లో మొత్తం 760 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఇటీవల షెడ్యూల్ విడుదల చేసింది. ఇందులో 17 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. దీంతో పాటు 544 నగర పంచాయతీ ఎన్నికలు, 199 నగర పాలిక పరిషత్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు ఎన్నికలు బ్యాలెట్ పేపర్ల ద్వారానే నిర్వహించనున్నారు. ఈ స్థానిక సంస్థల మొదటి దశ ఎన్నికలు మే 4వ తేదీన, రెండో దశ ఎన్నికలు 11వ తేదీన జరగనున్నాయి. మే 13న ఫలితాలు వెల్లడికానున్నాయి.