Home / latest national news
అస్సాం ప్రభుత్వం శనివారం పాఠశాల ఉపాధ్యాయులకు డ్రెస్ కోడ్‌ను జారీ చేసింది. వారు హుందాగా ఉండే రంగుల దుస్తులు ధరించి తరగతులకు హాజరు కావాలని, సాధారణ దుస్తులను ధరించరాదని కోరింది.
వయసనేది శరీరానికే కాని మనసుకు కాదని ఛత్తీస్‌గఢ్ ఆరోగ్య మంత్రి సింగ్ డియో నిరూపించారు. 70 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియాలో నేల నుండి వేల అడుగుల ఎత్తులో స్కైడైవింగ్ చేసి సంచలనం సృష్టించారు.
భారతీయ రిజర్వు బ్యాంకు రూ.2 వేల నోట్లను చలామణీ నుంచి ఉపసంహరిస్తున్నట్లు సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. వినియోగదారులకు రూ.2 వేల నోట్ల ఇవ్వకూడదని బ్యాంకులకు మే 19 వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. ఆర్బీఐ ఆదేశాలు తక్షణమే అమల్లోకి కూడా వచ్చాయి. అలాగే, సెప్టెంబరు 30 వరకు మాత్రమే రూ.2 వేల
తాను అవినీతికి పాల్పడినట్లు రుజువైతే సీబీఐకి దమ్ముంటే అరెస్టు చేయాలని టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ శుక్రవారం సవాల్ చేసారు. స్కూల్ ఉద్యోగాల కుంభకోణంపై విచారణలో భాగంగా శనివారం కోల్‌కతా కార్యాలయంలో హాజరుకావాలని సీబీఐ పిలుపునిచ్చిన నేపధ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.
ఘజియాబాద్-అలీఘర్ ఎక్స్‌ప్రెస్‌వే పై 100 గంటల సమయంలో 100 కిలోమీటర్ల దూరం బిటుమినస్ కాంక్రీట్‌ను ఏర్పాటు చేయడం ద్వారా గర్వించదగిన చరిత్ర సృష్టించామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం తెలిపారు.
అస్సాంలోని మోరిగావ్ జిల్లా మొయిరాబరి లోని శ్మశానవాటిక కమిటీ డ్రగ్స్ సేవించడం లేదా అక్రమ మాదకద్రవ్యాల వ్యాపారంలో పాల్గొనడం వల్ల మరణించిన వ్యక్తుల అంత్యక్రియలకు అనుమతించకూడదని నిర్ణయించింది.
తదుపరి విచారణ జరిపేవరకు జ్ఞాన్వాపి మసీదు-కాశీ విశ్వనాథ్ కారిడార్‌లోని శివలింగానికి కార్బన్ డేటింగ్ నిర్వహించరాదని సుప్రీంకోర్టు శుక్రవారం ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)కి తెలిపింది
లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా న్యూఢిల్లీలో నిరసన కొనసాగిస్తున్న రెజ్లర్లను రాజస్థాన్ కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్ శుక్రవారం కలుసుకున్నారు. దేశం గర్వించేలా చేసిన వారికి న్యాయం చేయడంలో ఆలస్యం ఎందుకంటూ ప్రశ్నించారు.
అదానీ గ్రూప్ ద్వారా ఎలాంటి ఉల్లంఘన జరగలేదు. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ నుండి ఎటువంటి నియంత్రణ వైఫల్యం జరిగిందని నిర్ధారించడం సాధ్యం కాదని హిండెన్‌బర్గ్ ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న సుప్రీంకోర్టు నియమించిన డొమైన్ నిపుణుల ప్యానెల్ క్లీన్ చిట్ ఇచ్చింది.
డ్రగ్స్ కేసులో నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను అరెస్టు చేసిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మాజీ అధికారి సమీర్ వాంఖడే తన కుటుంబంతో కలిసి విదేశాలకు అనేకసార్లు పర్యటించారని, ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని సీబీఐ నివేదిక పేర్కొంది