Home / latest national news
లండన్‌లోని భారత హైకమిషన్‌పై ఖలిస్థాన్ అనుకూల కార్యకర్తల దాడి చేసిన సంఘటనపై విచారణకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ( ఎన్ఐఏ) బృందం సోమవారం (మే 22) యునైటెడ్ కింగ్డమ్ రాజధానికి బయలుదేరింది.
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సోమవారం రాత్రి ట్రక్కు డ్రైవర్లను సందర్శించి వారి సమస్యలను తెలుసుకునేందుకు, వారి మన్ కీ బాత్ వినేందుకు వెళ్లారు. పార్టీ ట్వీట్ చేసిన విజువల్స్‌లో, గాంధీ ట్రక్కులో కూర్చొని, డ్రైవర్లలో ఒకరితో ప్రయాణిస్తూ మరియు ట్రక్ డ్రైవర్లతో మాట్లాడుతూ కనిపించారు.
ప్రధాని నరేంద్ర మోదీపై వివాదాస్పద డాక్యుమెంటరీ ప్రసారం చేసిన బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) పై గుజరాత్‌కు చెందిన ఎన్జీవో 10,000 కోట్ల నష్టపరిహారం కోసం దావా వేసింది. డాక్యుమెంటరీ ఎటువంటి ఆధారాలు లేకుండా నిరాధారమైన ఆరోపణలను చేస్తోందని ఎన్జీవో పేర్కొంది.
కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌లను ఆహ్వానించకపోవడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సోమవారం నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించారు
బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సోమవారం విధాన సౌధ ప్రాంగణాన్ని ఆవు మూత్రంతో శుభ్రపరిచారు. అవినీతి బిజెపి పాలన ముగిసిన నేపధ్యంలో తాము ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వారు తెలిపారు.
ముంబై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మాజీ అధికారి సమీర్ వాంఖడే ను షారూఖ్ ఖాన్ నుండి రూ. 25 కోట్ల లంచం డిమాండ్ చేసిన ఆరోపణలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఆదివారం ఐదు గంటలకు పైగా ప్రశ్నించింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ పరిపాలన మరియు సేవల విషయాలలో ఎన్నికైన ప్రభుత్వ అధికారాన్ని తగ్గించే కొత్త ఆర్డినెన్స్‌తో కేంద్ర ప్రభుత్వంతో తాజా పోరాటానికి సిద్దమయ్యారు
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆదివారం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లి అతడిని కలిసారు. కేవలం నెల రోజుల వ్యవధిలో వీరిద్దరి మధ్య ఇది రెండవ భేటీ కావడం విశేషం.
కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం డీకే శివకుమార్ మాట్లాడుతూ 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ బాగా పోరాడాలని అన్నారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన తర్వాత తాను సంతోషంగా లేనని అన్నారు.
కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలని ప్రధాని కాదని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆదివారం అన్నారు. త్రిభుజాకారంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ నెల 28న కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం జరగనుంది.