Last Updated:

DK Shivakumar Comments: తన ఇంటికి లేదా సిద్ధరామయ్య ఇంటికి రావద్దని కాంగ్రెస్ నేతలకు చెప్పిన డీకే శివకుమార్ .. ఎందుకో తెలుసా ?

కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం డీకే శివకుమార్ మాట్లాడుతూ 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ బాగా పోరాడాలని అన్నారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన తర్వాత తాను సంతోషంగా లేనని అన్నారు.

DK Shivakumar Comments:  తన ఇంటికి లేదా సిద్ధరామయ్య ఇంటికి రావద్దని కాంగ్రెస్ నేతలకు చెప్పిన డీకే శివకుమార్ .. ఎందుకో తెలుసా ?

DK Shivakumar Comments: కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం డీకే శివకుమార్ మాట్లాడుతూ 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ బాగా పోరాడాలని అన్నారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన తర్వాత తాను సంతోషంగా లేనని అన్నారు.

తదుపరి లక్ష్యం లోక్‌సభ ఎన్నికలే..(DK Shivakumar Comments)

అసెంబ్లీ ఎన్నికల్లో మనకు 135 సీట్లు వచ్చాయి. కానీ నేను సంతోషంగా లేను. నా ఇంటికి లేదా సిద్ధరామయ్య ఇంటికి రావద్దు. మన తదుపరి లక్ష్యం లోక్‌సభ ఎన్నికలే. మనం బాగా పోరాడాలి అని శివకుమార్ బెంగళూరులో పార్టీ క్యాడర్‌ను ఉద్దేశించి అన్నారు. అంతకుముందు బెంగళూరులోని కెపిసిసి కార్యాలయంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 32వ వర్ధంతి సందర్భంగా కర్ణాటక సిఎం సిద్ధరామయ్య, శివకుమార్‌తో కలిసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ ప్రధాని మోదీ తీవ్రవాదం గురించి మాట్లాడుతున్నారని, ఉగ్రవాదం వల్ల బీజేపీకి చెందిన ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని అన్నారు. మేం ఉగ్రవాదానికి మద్దతిస్తున్నామని బీజేపీ చెబుతోంది కానీ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వంటి చాలా మంది కాంగ్రెస్ నేతలు ఉగ్రదాడుల్లో చనిపోయారని అన్నారు.

శివకుమార్‌ను కాంగ్రెస్‌లో “ట్రబుల్‌షూటర్‌”గా పిలుస్తారు. 61 ఏళ్ల శివకుమార్ 8 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తన ఆర్గనైజింగ్ స్కిల్స్‌తో పార్టీ కేంద్ర నాయకత్వం నుండి పూర్తి ప్రశంసలు పొందారు, ముఖ్యంగా ఇటీవలి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక సీట్లు సాధించడం వెనుక డీకే కృషి చాలా ఉంది. సీఎం రేసులో పోటీ పడినప్పటికీ ఉపముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.