Home / latest national news
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం లోక్‌సభ ఛాంబర్లోని స్పీకర్ కుర్చీకి కుడి వైపున ఉన్న ప్రత్యేక ఎన్‌క్లోజర్‌లో చారిత్రక సెంగోల్‌ను ఏర్పాటు చేశారు. డిసెంబర్ 10, 2020న ప్రధానమంత్రి కొత్త పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన చేశారు.
New Parliament: భారత పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవానికి సిద్దమైంది. సకల హంగులతో ఈ పార్లమెంట్ భవనాన్ని నిర్మించారు.
ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఎంపీగా అనర్హత వేటు పడిన తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తనకు జారీ చేసిన డిప్లమాటిక్ పాస్‌పోర్ట్‌ను సరెండర్ చేశారు.క్రిమినల్ పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు దోషిగా తేలడంతో మార్చిలో రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వం పై అనర్హత వేటు పడింది
ది డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్' సినిమా దర్శకుడు సనోజ్ మిశ్రా కు కోల్‌కతా పోలీసులు సమన్లు జారీ చేశారు. మే 30న విచారణ నిమిత్తం పోలీసుల ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. మేలో కోల్‌కతాలోని అమ్హెర్స్ట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో సినిమాపై వ్రాతపూర్వక ఫిర్యాదు నమోదయింది.
:ఢిల్లీ ప్రభుత్వ విజిలెన్స్ డైరెక్టరేట్ లెఫ్టినెంట్ గవర్నర్‌కు సమర్పించిన వాస్తవ నివేదిక ప్రకారం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికారిక నివాసం పునరుద్ధరణకు మొత్తం రూ. 52.71 కోట్లు వెచ్చించినట్లు అధికారిక వర్గాలు గురువారం తెలిపాయి.
: కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ పాస్‌పోర్ట్ పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు శుక్రవారం పాక్షికంగా అనుమతించి మూడేళ్లపాటు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) మంజూరు చేసింది. నేను మీ దరఖాస్తును పాక్షికంగా అనుమతిస్తున్నాను.
ఛత్తీస్‌గఢ్‌లోని ఒక ప్రభుత్వ అధికారి తన మొబైల్‌ను డ్యామ్ లో పడిపోవడంతో దానిని తీసుకోవడానికి పొలాలకు ఉద్దేశించిన మిలియన్ల గ్యాలన్ల నీరు డ్యామ్ నుంచి తోడించాడు. దీనికి సంబంధించి వివరాలివి.
ఇప్పటికే భారత్‌తో సరిహద్దు ప్రతిష్టంభనలో చిక్కుకున్న చైనా, ఉత్తరాఖండ్‌కు ఆనుకుని సరిహద్దు రక్షణ గ్రామాలను నిర్మిస్తోందని తెలుస్తోంది. 250 ఇళ్లతో కూడిన ఈ సరిహద్దు గ్రామాలను వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి)కి 11 కిలోమీటర్ల దూరంలో నిర్మిస్తున్నారు. కేవలం సరిహద్దు వెంబడి తూర్పు సెక్టార్లో 400 గ్రామాలను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయబడిన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యుఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్, చట్టం పెద్ద స్థాయిలో దుర్వినియోగం అవుతోంది అని ఆరోపించారు. మేము దానిని మార్చమని ప్రభుత్వం పై వత్తిడి తెస్తామని తెలిపారు
మే 28న కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్రం రూ.75 నాణెం విడుదల చేయనుంది. నాణేల చట్టం, 2011లోని సెక్షన్ 24 ప్రకారం ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభిస్తారు.