Home / latest inter national news
ఆకలితో చనిపోతే స్వర్గానికి వెళ్తామని నమ్మిన క్రైస్తవ మతానికి చెందిన వారిగా భావిస్తున్న 51మంది మృతదేహాలను కెన్యా పోలీసులు వెలికితీశారు.తీర ప్రాంత పట్టణం మలిండి సమీపంలో పోలీసులు శుక్రవారం షాకహోలా అటవీప్రాంతం నుండి మృతదేహాలను వెలికి తీయడం ప్రారంభించారు
స్కాట్లాండ్ తీరంలో జనావాసాలు లేని ద్వీపం అమ్మకానికి ఉంది, దీని ధర సుమారు రూ. 1.5 కోట్లు కంటే ఎక్కువ. 25 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బార్లోకో ద్వీపం డంఫ్రైస్ మరియుగాల్లోవేలోని కిర్క్కుడ్బ్రైట్ నుండి రోడ్డు మార్గంలో దాదాపు తొమ్మిది మైళ్ల దూరంలో ఉంది.
ఉక్రెయిన్‌పై భీకర దాడులకు పాల్పడుతున్న రష్యా తాజాగా సొంత నగరంపైనే బాంబు దాడి చేసింది. నాలుగు లక్షల జనాభా ఉన్న పట్టణంపై తన యుద్ధ విమానం నుంచి ఓ ఆయుధాన్ని జారవిడిచింది. పేలుడు ధాటికి నగరంలో ఓ కూడలి వద్ద దాదాపు 40 మీటర్ల వ్యాసంతో పెద్ద గొయ్యి ఏర్పడింది
బ్రిటన్ ఉప ప్రధాని, న్యాయశాఖ మంత్రి డొమినిక్ రాబ్ తాజాగా తన పదవికి రాజీనామా చేశారు. న్యాయశాఖలో పాటు వైట్హాల్ విభాగాల్లో ఆయన సిబ్బందిపై వేధింపులకు పాల్పడ్డారంటూ గత కొంతకాలంగా ఆరోపణలు వినవస్తున్నాయి.
పాకిస్తాన్లో హృద్రోగులు దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. గుండె జబ్బుల చికిత్సకు కావాల్సిన ముఖ్యమైన హెపారిన్ ఇంజక్షన్‌కు తీవ్రమైన కొరత ఏర్పడింది. దీనితో అక్కడి రోగులు చికిత్స పొందడానికి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తాజాగా ఓ నివేదిక వెల్లడించింది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమయి పద్నాలుగు నెలలు గడిచింది. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రష్యన్ పౌరుల పాక్షిక సైనిక సమీకరణను ప్రకటించారు. ఈ నేధ్యంలో దేశం యొక్క తప్పనిసరి సైనిక ముసాయిదా నుండి తప్పించుకునే వారిని పట్టుకోవడానికి మాస్కో కఠినమైన చర్యలు తీసుకుంటోంది.
అమెరికాలో విద్యార్థులతో లైంగికసంబంధాలు పెట్టుకున్నందుకు రెండు రోజుల వ్యవధిలో కనీసం ఆరుగురు మహిళా టీచర్లు అరెస్టయ్యారు.న్యూయార్క్ పోస్ట్‌లోని ఒక నివేదిక ప్రకారం, వుడ్‌లాన్ ఎలిమెంటరీ స్కూల్లో పనిచేసిన డాన్విల్లేకు చెందిన ఎల్లెన్ షెల్ థర్డ్-డిగ్రీ రేప్‌కు పాల్పడ్డారు.
పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం లో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీకి ఆంటిగ్వా కోర్టులో ఊరట లభించింది. అతడిని దేశం నుంచి పంపించడానికి వీల్లేదంటూ ఛోక్సీకి అనుకూలంగా అక్కడి హైకోర్టు ఉత్తర్వులు వెలువరించినట్లు తెలుస్తోంది.
ఆస్ట్రేలియన్-అమెరికన్ బిలియనీర్, మీడియా మెఘల్గా పేరు తెచ్చుకున్న దిగ్గజ వ్యాపారవేత్త రూపర్ట్ మర్దోక్ జెర్రీ హాల్‌తో తన వివాహాన్ని ఆమెకు ఇమెయిల్ ద్వారా 11 పదాల వాక్యంతో ముగించాడు. ఎలాంటి హెచ్చరిక లేకుండానే ఆయన విడాకులు తీసుకున్నారని వానిటీ ఫెయిర్ మ్యాగజైన్ నివేదించింది.
: వచ్చే నెలలో కింగ్ చార్లెస్ III పట్టాభిషేకానికి ముందు 'కాస్ట్ ఆఫ్ ది క్రౌన్' సిరీస్‌లో భాగంగా, బ్రిటన్ రాజ సంపద మరియు ఆర్థిక విషయాలపై ది గార్డియన్ వార్తాపత్రిక వివరిస్తోంది.ఈ వారం నివేదికలలో ఒకదానిలోఇది క్వీన్ మేరీ, దివంగత క్వీన్ ఎలిజబెత్ II యొక్క నానమ్మ, ఆమె సామ్రాజ్య మూలాల గురించి వివరించింది.