Home / latest inter national news
రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను హత్య చేయడానికి ఉక్రెయిన్ కుట్ర పన్నినట్లు క్రెమ్లిన్ వర్గాలు తెలిపాయి. గత రాత్రి డ్రోన్ల ద్వారా క్రెమ్లిన్‌పై దాడులు జరిగాయని, అయితే పుతిన్ మాత్రం సురక్షితంగా ఉన్నారని.. తన పనులు తాను చేసుకుంటున్నారని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
సెర్బియా లోని బెల్గ్రేడ్ పాఠశాల తరగతి గదిలో 14 ఏళ్ల బాలుడు జరిపిన కాల్పుల్లో ఎనిమిదిమంది విద్యార్దులు, ఒక సెక్యూరిటీ గార్డు చనిపోయారు. తీవ్రంగా గాయపడిన ఒక ఉపాధ్యాయుడు, ఆరుగురు విద్యార్దులను ఆసుపత్రిలో చేర్చారు.
ఉత్తర మరియు పశ్చిమ రువాండాలో వరదల కారణంగా కనీసం 109 మంది మరణించారని స్థానిక అధికారుల గణాంకాలను ఉటంకిస్తూ ప్రభుత్వ నిర్వహణలోని రువాండా బ్రాడ్‌కాస్టింగ్ ఏజెన్సీ (ఆర్బీఏ) తెలిపింది.నిన్న రాత్రి కురిసిన వర్షం ఉత్తర మరియు పశ్చిమ ప్రావిన్స్‌లలో విపత్తుకు కారణమైందని ఆర్బీఏ తన వెబ్సైట్లో తెలిపింది.
మూడు సంవత్సరాల కోవిడ్-19 నియంత్రణలు ఎత్తివేయడంతో చైనాలో పర్యాటకుల తాకిడి పెరగింది. . పర్యాటకుల రద్దీని తట్టుకోలేక హోటళ్లు మరియు టూరిస్ట్ హాట్స్పాట్లు కిక్కిరిసి పోతున్నాయి
హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ‘కాళీ మాత’ ఫొటోతో ఉక్రెయిన్ ఇటీవల ఓ వివాదాస్పద ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది దీనిని హిందువుల మనోభావాలపై ఉక్రెయిన్ దాడి అంటూ పేర్కొన్నారు.
చైనాలో పెరుగుతున్న నిరుద్యోగిత రేటు దేశానికి ఒక ముఖ్యమైన ఆర్థిక సవాలుగా మారుతోంది. చైనా యొక్క అత్యంత సంపన్న ప్రావిన్స్ మరియు తయారీ దిగ్గజం గ్వాంగ్డాంగ్, 300,000 మంది నిరుద్యోగ యువతను ఉపాధి కోసం రెండు మూడు సంవత్సరాల పాటు గ్రామీణ ప్రాంతాలకు పంపాలని ప్రతిపాదించింది.
నెక్రోఫిలియా.. చనిపోయిన వారితో సెక్స్ చేయడంలో లైంగిక ఆనందాన్ని పొందడం.. ఇటువంటి కేసులు పాకిస్తాన్ లో ఇటీవల కాలలో పెరిగిపోయాయి. దీనితో కుటుంబ పెద్దలు చనిపోయిన తమ కుమార్తెల లేదా ఇతర మహిళల సమాధులకు తాళాలు వేయడం ప్రారంభించారు.
గురువారం తూర్పు బుర్కినా ఫాసోలో సైనికుల బృందంపై అనుమానిత జిహాదీలు దాడి చేయడంతో 33 మంది సైనికులు మరణించగా 12 మంది గాయపడినట్లు సైన్యం తెలిపింది.గాయపడిన సైనికులను సురక్షితంగా తరలించామని, వారికి వైద్యసేవలు అందిస్తున్నామని ప్రకటించింది.
NATO Allies: నాటో మిత్రదేశాలు మరియు భాగస్వాములు ఉక్రెయిన్‌కు 1,550 సాయుధ వాహనాలు మరియు 230 ట్యాంకులను అందించారు. రష్యా దళాల నుండి భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడంలో సహాయపడుతున్నారని నాటో చీఫ్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ గురువారం తెలిపారు. 98 శాతం కంటే ఎక్కువ ఇచ్చాము..( NATO Allies) గత సంవత్సరం ఫిబ్రవరిలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఉక్రెయిన్‌కు వాగ్దానం చేసిన పోరాట వాహనాల్లో 98 శాతం కంటే ఎక్కువ డెలివరీ చేసామని స్టోల్టెన్‌బర్గ్ ఒక వార్తా […]
అంతర్గతయుద్దంతో సతమతమవుతున్న సూడాన్ లో చిక్కుకున్న భారతీయుల తరలింపు ప్రారంభమయింది. మొదటి బ్యాచులో భాగంగా ఆపరేషన్ కావేరి కింద ఐఎన్ఎస్ సుమేధ నౌకలో278 మంది సూడాన్ నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డాకు బయలు దేరారు.