Home / latest ap news
తిరుపతి జిల్లా చంద్రగిరి డీఎస్పీ శరత్ రాజ్‌కుమార్‌పై వేటు పడింది. ఆయన్ను డీజీపీ కార్యాలయానికి సరెండర్ చేస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. చంద్రగిరిలో ఎన్నికల పోలింగ్, ఆ తర్వాత జరిగిన ఘటనల విషయంలో చర్యలు తీసుకోకపోవడమే దీనికి కారణమని సమాచారం.
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కు హైకోర్టులో ఊరట లభించింది. కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ - క్యాట్ ఉత్తర్వులను సస్పెండ్ చేసేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది.
ఓట్ల లెక్కింపు సందర్భంగా ఓటమి భయంతో వైసీపీ దాడులు చేసే అవకాశం ఉందని నాగబాబు అనుమానం వ్యక్తం చేశారు. కూటమి నేతలు, జనసైనికులు సంయమనం పాటించాలని ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో కూటమి నాయకులూ ,కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఒక వీడియో విడుదల చేసారు .
జనసేనాని పవన్ కళ్యాణ్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారనే వార్తలు వచ్చినప్పటి నుంచి పిఠాపురం హాట్ టాపిక్ గా మారింది .ఎన్నికల ప్రచారం సమయంలోను ఎన్నికల అనంతరం కూడా పిఠాపురం వార్తల్లోకి ఎక్కుతూనే వుంది
వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారని తిరుపతి జనసేన ఇంచార్జ్ కిరణ్ రాయల్ మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ ను.. అధికారులను పట్టించుకోకుండా కౌంటింగ్ వెళ్ళాలని ఎలా సజ్జల చెబుతారని నిలదీశారు. వైసీపీ కేడర్ సజ్జల ట్రాప్ లో పడొద్దని సూచించారు.
ఏపీ ఈసెట్ 2024 - ( ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్) ఫలితాలు విడుదల అయ్యాయి. అనంతపురం జేఎన్టీయూ లోఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి ఈసెట్ ఫలితాలు విడుదల చేశారు. ఈసెట్ ఫలితాలలో బాలికలు 93.34 శాతం, బాలురు 89.35 శాతం విద్యార్ధుల ఉత్తీర్ణత సాధించారు.
హత్యాయత్నం కేసులో టిటిడి డిప్యూటీ ఈఈ శ్రీలక్ష్మీని పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీలక్ష్మీతోపాటు ఆమె భర్త గిరీష్ చంద్రారెడ్డి, మరో ఇద్దరిని అలిపిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిసి కెమెరా ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్ల ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు జరిగాయి.
ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా శ్రీహరికోట నుంచి ప్రయోగించాలనుకున్న ప్రైవేట్ రాకెట్ అగ్నిబాణ్ రాకెట్ ప్రయోగం మరోసారి వాయిదా పడింది. సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ -షార్ లోని ప్రైవేట్ లాంచింగ్ వేదిక నుంచి మంగళవారం ఉదయం ఈ రాకెట్‌ను ప్రయోగించాల్సి ఉన్నది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాయితో దాడి కేసులో నిందితుడు సతీష్ కి జిల్లా కోర్టు ఎట్టికేలకు బెయిల్ మంజూరు చేసింది. కోర్ట్ కొన్ని షరతులు విధించింది. పోలీస్ విచారణకు సతీష్ సహకరించాలని ఆదేశించింది.