Home / latest ap news
ఈ మధ్య విహార యాత్రలు విషాదంగా మారడం జరుగుతూవున్నాయి .అట విడుపు కోసం నదులు,సముద్రాలూ,జలపాతాలలో స్నానానికి వెళ్లి మృత్య వడిలోకి జారుకుంటున్నారు .తాజాగా విజయ నగరం జిల్లా జామి మండలం జాగారం వాటర్ ఫాల్స్ వద్ద ముగ్గురు యువకులు వాటర్ ఫాల్స్ లో పడి మరణించిన సంఘటన వెలుగులోకి వచ్చింది .
విజయవాడ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి భారీ విమానం ఎయిర్ బస్ 340 వచ్చింది.ఏపీ హజ్ యాత్రికులను తీసుకువెళ్లేందుకు ఆ విమానం వచ్చింది . ఈ భారీ విమానానికి వాటర్ కానన్ తో ఎయిర్పోర్ట్ అధికారులు ఘన స్వాగతం పలికారు.
ఇప్పటికే ఈవీఎం ధ్వంసం కేసులో బెయిల్ మీద వున్న మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి కి మరో ఊరట లభించింది .మరో 3 కేసుల్లో ముందస్తు బెయిల్‌ను ఏపీ హైకోర్టు మంజూరు చేసింది . దీనికి కూడా గతంలో విధించిన షరతులే వర్తిస్తాయని హైకోర్టు పేర్కొంది
కృష్ణా జిల్లా పెడన రైతులను అధికారులు నట్టేట ముంచారు. ఫేక్ అకౌంట్లు సృష్టించి అసలు బాధిత రైతులకు బదులు ఇతరుల ఖాతాల్లో పంట నష్టపరిహారం డబ్బులను జమ చేశారు. రైతులను నిండా ముంచిన ఈ వ్యవహారం తాజాగా బట్టబయలైంది.
టీవల ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి రహస్యంగా విశాఖ వెళ్లిరావడం పలు అనుమానాలకు తావిచ్చింది .ఇదే క్రమంలో విశాఖ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ జవహర్ రెడ్డి పై తీవ్ర వ్యాఖ్యలు చేసారు . సీఎస్ సీక్రెట్ విశాఖ పర్యటనలు పూర్తి స్థాయిలో భూకబ్జాల కోసమేనని మూర్తి యాదవ్ ఆరోపించారు
ఏపీలో పోస్టల్ బ్యాలెట్ లు చెల్లుబాటు విషయంలో రాజకీయ పార్టీలకు ఊరట లభించింది. పోస్టల్ బ్యాలట్ విషయంలో ఏపీలో ఎన్నికల అయిపోయిన తరవాత నుంచి రకరకాల ఊహాగానాలు తెరమీదకి వచ్చాయి .
ఏపీలోని కర్నూల్ జిల్లా దేవర గట్టు పేరు చెప్పగానే వెంటనే గుర్తుకు వచ్చేది .కర్రల యుద్ధం. ప్రతి దసరా రోజు రాత్రి బన్నీ ఉత్సవం పేరుతో కర్రల తో కొట్టుకుంటారు .దీనికి ఇప్పుడు మంచి గుర్తింపు వచ్చింది . పదో తరగతి పాఠ్యపుస్తకాల్లో కర్నూలు జిల్లా ఆలూరు మండలం దేవరగట్టు సంబరానికి అరుదైన గుర్తింపు దక్కింది.
మాజీ మంత్రి, విజయ డెయిరీ డైరెక్టర్ యెర్నేని సీతాదేవి కన్నుమూశారు. హైదరాబాద్‌లో సోమవారం ఉదయం గుండెపోటుతో ఆమె తుదిశ్వాస విడిచారు. సీతాదేవి స్వస్థలం ఏపీలోని కైకలూరు మండలం కోడూరు. ముదినేపల్లి నుంచి తెదేపా తరఫున ఆమె రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
ఇటీవల క్రమం తప్పకుండా ఆంధ్ర రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి .రోడ్లు రక్తపు ఏరులై పారుతున్నాయి .తాజాగా జరిగిన రెండు ఘోర రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి చెందారు.
ఏపీలో ఎన్నికల ముగిసినప్పటికీ దానికి సంబంధించిన ఘటనలు ఇంకా వెంటాడుతూనే వున్నాయి . ఒక వైపు అల్లర్లు కేసులు ,మరో వైపు ప్రముఖలు పర్యటనలో అలసత్వం చూపించినందుకు పోలీసులపై చర్యలు కొనసాగుతున్నాయి .