Home / LAC
ఇప్పటికే భారత్‌తో సరిహద్దు ప్రతిష్టంభనలో చిక్కుకున్న చైనా, ఉత్తరాఖండ్‌కు ఆనుకుని సరిహద్దు రక్షణ గ్రామాలను నిర్మిస్తోందని తెలుస్తోంది. 250 ఇళ్లతో కూడిన ఈ సరిహద్దు గ్రామాలను వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి)కి 11 కిలోమీటర్ల దూరంలో నిర్మిస్తున్నారు. కేవలం సరిహద్దు వెంబడి తూర్పు సెక్టార్‌లో 400 గ్రామాలను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
తూర్పు లడఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి చైనా దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి విదేశాంగ మంత్రి జైశంకర్ ఘాటుగా సమాధానం ఇచ్చారు.
చైనా వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి) దగ్గర మరియు వివాదాస్పద అక్సాయ్ చిన్ ప్రాంతం గుండా కొత్త లైన్‌ను నిర్మించబోతున్నట్లు రైల్వే టెక్నాలజీ నివేదిక తెలిపింది.