Home / KTR
బీజేపీతో పొత్తు గతంలో లేదని, భవిష్యత్‌లో కూడా ఉండదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎన్నటికీ బీజేపీకి బి టీం కాదని కెటిఆర్ అన్నారు. భువనగిరి పార్లమెంటు నియోజక వర్గ సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.
సీఎం రేవంత్ రెడ్డిని చూసి కేటీఆర్, హరీష్ రావులు భయపడుతున్నారని కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ అన్నారు. గొప్ప మనసు ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి అని కొనియాడారు. ఆయన్ను విమర్శించే స్థాయి బీఆర్ఎస్ నేతలకు లేదని మండిపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రాలకి పోటీగా రేపు స్వేద పత్రాన్ని విడుదల చేస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఆయన ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు.
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు,(కేటీఆర్) కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మధ్య మంగళవారం ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం జరిగింది. ఎన్నికల్లో ఓట్ల కోసం ఎన్నో హామీలు ఇస్తాం. అంతమాత్రాన ఫ్రీగా ఇవ్వాలా? మాకు ఇవ్వాలనే ఉంది. అయితే డబ్బులు లేవంటూ సీఎం సిద్దరామయ్య మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది.
కాంగ్రెస్ చేతిలో పార్టీ పరాజయం పాలైనందుకు తీవ్ర నిరాశకు లోనయినా చింతించలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు (కేటీఆర్ ) అన్నారు. ప్రజాతీర్పును శిరసావహించి సీఎం కేసీఆర్ తన పదవికి రాజీనామా చేసారని అన్నారు.
తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ దీక్షా దివస్ కార్యక్రమంలో భాగంగా మంత్రి కేటీఆర్ రక్తదానం చేశారు. కేసీఆర్ ఆమరణ దీక్షకు నేటికి 15 ఏళ్లు అయిన సందర్బంగా నాటి చైతన్యాన్ని గుర్తు తెచ్చుకుందామని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ సచ్చుడో , తెలంగాణ వచ్చుడో అని నినదించిన నేత కేసీఆర్ అని అన్నారు.
ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా ఉన్న బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఇవాళ హైదరాబాద్ మెట్రో రైల్లో ప్రయాణించారు. HICC లో రియల్ ఎస్టేట్ సమ్మిట్‌లో పాల్గొన్న అనంతరం రాయదుర్గంనుంచి బేగంపేట వరకు మెట్రోలో ప్రయాణించారు.
మంత్రి కేటీఆర్ మైనార్టీలతో తెలంగాణ భవన్లో సమావేశం అయ్యారు. ఇక ఈ మీటింగ్ అనంతరం.. ఆయన ఓ కీలక ప్రెస్ మీట్ నిర్వహించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో మైనార్టీల విషయంలో వచ్చిన అంశంపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. మైనారిటీల విషయంలో కాంగ్రెస్, భాజపా ఆలోచనలు ఒకేలా ఉన్నాయన మంత్రి కేటీఆర్ అన్నారు.
హైదరాబాద్ జలవిహార్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ న్యాయవాదుల సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ న్యాయవాదులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేశారని కేటీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్ధులకు ధీటుగా న్యాయవాదులు పోరాడారని మంత్రి గుర్తుచేశారు.
: ప్రతిపక్ష పార్టీలపై మంత్రి కేటీఆర్ మరోసారి విరుచుకు పడ్డారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిపోయాడని.. అలాంటి వ్యక్తి ఇప్పుడు అవినీతి గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎల్బీ నియోజక వర్గంలో నిర్వహించిన బీఆర్ఎస బూత్ కమిటీల సమావేశంలో ఆయన మాట్లాడారు.