Home / krishna funerals
సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు బుధవారం ప్రభుత్వ లాంఛనాల నడుమ జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ముగిశాయి. మధ్యాహ్నం తర్వాత నటశేఖరుడి అంతమ యాత్ర ప్రారంభమైంది. అశేష జనవాహిని అశ్రునయనాల నడుమ అనంతలోకాలకు పయమనమయ్యారు కృష్ణ. పద్మాలయ స్టూడియోస్ నుంచి ఆయన పార్థివదేహాన్ని జూబ్లీహిల్స్ మహా ప్రస్థానానికి అంతిమ యాత్ర కదిలింది.
సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు బుధవారం ప్రభుత్వ లాంఛనాల నడుమ జూబ్లీ హిల్స్‌లోని మహాప్రస్థానంలో ముగిశాయి. మంగళవారం తెల్లవారు జామున గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కృష్ణ కన్నుమూశారు.
సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్య కారణాల దృష్ట్యా మంగళవారం తెల్లవారుజామున మృతిచెందారు. కాగా ఆయన పార్థివ దేహానికి సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్, చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు, మరియు సినీ ప్రముఖులు అయిన మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ, వెంకటేష్, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లుఅర్జున్ వంటి పలువురు తారలు నివాళులర్పించారు. సినీలోకం దిగ్గజ నటుడిని కోల్పోయిందని వారు అన్నారు.
టాలీవుడ్ కీలక నిర్ణయం తీసుకుంది. సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల నివాళులర్పిస్తూ నిర్మాతల మండలి రేపు షూటింగ్స్ కు బంద్ ప్రకటించింది. రేపు ఏపీ అంతటా ఉదయం ఆటను రద్దు చేస్తున్నట్టు థియేటర్ల యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.
సూపర్ స్టార్ కృష్ణ ఈ రోజు ఉదయం 4గంటల సమయంలో కన్నుమూశారు. కాగా ఆయన పార్థివదేహాన్ని నానక్ రామ్ గూడలోని మహేష్ ఇంట్లో కుటుంబ సభ్యులు బంధుమిత్రుల సందర్శార్థం ఉంచారు. కాగా ఆయన పార్ధివ దేహానికి రేపు పంజాగుట్ట మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుపనున్నారు. అధికార లాంఛనాలతో తెలంగాణ ప్రభుత్వం కృష్ణ అంత్యక్రియలు నిర్వహించనుంది.