Home / Kerala Blasts
కేరళ ప్రార్దనా మందిరంలో పేలుళ్ల కేసులో నిందితుడు డొమినిక్ మార్టిన్, యూట్యూబ్ ట్యుటోరియల్స్ సహాయంతో పేలుడు పదార్థాలను తయారు చేయడం నేర్చుకున్నానని చెప్పాడు. కొచ్చిలోని తమ్మనంలోని తన అద్దె ఇంటి టెర్రస్‌పై మరియు అలువా సమీపంలోని పూర్వీకుల ఇంటిపై ట్రయల్స్ నిర్వహించినట్లు పోలీసులకు చెప్పాడు.
కేరళలోని త్రిస్సూర్ జిల్లాలోని కలమస్సేరిలో జరిగిన వరుస పేలుళ్లకు బాధ్యత వహిస్తున్నట్లు ఓ వ్యక్తి ప్రకటించాడు. డొమినిక్ మార్టిన్ అనే వ్యక్తి మూడు పేలుళ్లు జరిగిన కన్వెన్షన్ సెంటర్లోబాంబును అమర్చినట్లు పోలీసులు తెలిపారు.
ఆదివారం కేరళలోని ఎర్నాకులం జిల్లాలో క్రైస్తవ ప్రార్థనా సమావేశంలో జరిగిన పేలుడు IED వల్ల సంభవించిందని రాష్ట్ర పోలీసు షేక్ దర్వేష్ సాహెబ్ తెలిపారు. అయితే జరిగిన పేలుళ్ల సంఖ్యపై విరుద్ధమైన నివేదికలు ఉన్నాయి. రాష్ట్ర మంత్రులు వీఎన్ వాసవన్, ఆంటోని రాజులు ఇద్దరు చెప్పగా, ప్రత్యక్ష సాక్షులు పలు పేలుళ్లు జరిగాయని చెబుతున్నారు.