Home / Kedarnath Temple
ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్ నాథ్ వద్ద భారీ వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో కేదార్ నాథ్ యాత్రను అధికారులు నిలిపివేశారు. గౌరీ కుండ్ నుంచి కేదార్ నాథ్ వరకు విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో సోన్ ప్రయాగ్ నుంచి బయల్దేరిన భక్తులు ఆగిపోవాలని అధికారులు స్పష్టం చేశారు.
పదకొండవ జ్యోతిర్లింగమయిన కేదార్నాథ్ ఆలయం తలుపులు మంగళవారం ఉదయం పూజలతో తెరవబడ్డాయి.ఈ మందిరంలో మొదటి పూజను ప్రధాని నరేంద్ర మోదీ పేరిట చేశారు.
ప్రసిద్ద పుణ్యక్షేత్రం కేదార్నాథ్ ఏప్రిల్ 25న తెరవబడుతుందని అధికారులు బుధవారం తెలిపారు.ఏప్రిల్ 25న యాత్ర ప్రారంభం కానుంది.భక్తులు నడకతో పాటు హెలికాప్టర్లో కేదార్నాథ్ ధామ్‌కు చేరుకోవచ్చని అధికారులు తెలిపారు.
శీతాకాలం ప్రవేశించిన నేపధ్యంలో ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్ ఆలయాన్ని గురువారం మూసివేసారు. ఉదయం 8.30 గంటలకు వేద శ్లోకాల మంత్రోచ్ఛారణల మధ్య ప్రార్థనలు చేసిన తర్వాత భక్తుల కోసం ఆలయ తలుపులు మూసివేసినట్లు బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయ కమిటీ వర్గాలు తెలిపాయి.