Home / Janasena
AP Deputy CM Pawan Kalyan rural development: రాజకీయ రణక్షేత్రంలో ఏ రాజకీయ పార్టీకైనా బలం, బలగం… కార్యకర్తలే. పార్టీ శ్రేణులు క్రియాశీలకంగా ఉన్న వారికి ఎదురే ఉండదు. అధిష్టానం పిలుపునిచ్చిన కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడం.. సిద్ధాంతాలు, ఆలోచనలను ప్రజల్లోకి ప్రభావితంగా తీసుకు వెళ్లడం, సభ్యత్వ నమోదులో కార్యకర్తలదే ప్రధాన భూమిక. ఆంధ్రప్రదేశ్ లోని జనసేన ఇప్పుడు అదే బలంతో ముందడుగు వేస్తోంది. తన బలగంతో మరింత సమర్థవంతంగా గ్రామ స్థాయిలో బలోపేతమవుతోంది. గ్రామస్థాయిలో […]
పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచి.. దేశంలోనే ఒక రికార్డు నెలకొల్పామని.. జనసేన అదినేత.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రతినిధుల సభలో ఆయన మాట్లడారు.
ఏపీలో తాజాగా జరిగిన ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేన పోటీచేసిన 21 స్థానాలు గెలవబోతున్నట్లు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు తెలిపారు . అన్ని సర్వేలు, మీడియా సంస్థల నివేదికలు కూటమి అధికారంలోకి రానున్నట్లు చెబుతున్నాయని.. ముఖ్యంగా జనసేన పోటీ చేసిన 21 కి 21 స్థానాల్లో గెలవబోతున్నట్లు సమాచారం ఉందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు స్పష్టం చేశారు
వైసీపీ డీఎన్ఏ లోనే హింస ఉందని మరోసారి రుజువు అయిందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. రాష్ట్రంలో ఓటర్లు విజ్ఞతతో ఓట్లు వేశారని అన్నారు. 81.86 శాతం పోలింగ్ నమోదు కావడమే దీనికి నిదర్శనమని ఆయన అన్నారు.
ఏపీలో టీడీపీ, జనసేన పొత్తులపై జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు .తెలుగుదేశం అభ్యర్థులను ప్రకటిస్తుండటంతో పొత్తు ధర్మం ప్రకారం అలా ప్రకటించకూడదని కామెంట్ చేశారు . ఆశావహులు టికెట్ల విషయంలో తనను కూడా ఒత్తిడి చేస్తున్నారని అన్నారు పవన్ .
జనసేనకు గాజు గ్లాసు గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం ఖరారు చేసింది. జనసేన పార్టీకి గాజు గ్లాసును గుర్తుగా ఖరారు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ ఉత్తర్వులు ఈ-మెయిల్ ద్వారా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి అందాయి. ఒక పక్క పార్టీలో పెరుగుతున్న చేరికలు, మరోవైపు గాజు గ్లాసు గుర్తు ఖరారు చేయడం శుభ సంకేతాలని పార్టీ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
మంగళగికి జనసేన పార్టీ కార్యాలయానికి బుధవారం పలువరు నేతలు క్యూ కట్టారు. పవన్ కళ్యాణ్ తో గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ సమావేశమయ్యారు. జనసేన పార్టీలో చేరే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. త్వరలోనే మంచిరోజు చూసుకుని పార్టీలో చేరుతారని సమాచారం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ను మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కలిశారు.
2024 సార్వత్రిక ఎన్నికలు రాష్ట్రాభివృద్దికి, జనసేన పార్టీకి చాలా కీలకమని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. ఈ నేపధ్యంలో ప్రవాసాంధ్రులంతా పార్టీ గెలుపుకు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని కోరారు. అవకాశం ఉన్న ప్రతి ఎన్ఆర్ఐ జనసైనికుడు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాస్ఠ్రంలోని తమ నియోజకవర్గాల పరిధిలో పార్టీ గెలుపుకు అండగా ఉండాలని ఆయన పిలుపు నిచ్చారు.
మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను ఎన్నారై బృందాలు కలిశాయి. ఆస్ట్రేలియ కన్వీనర్ కొలికొండ శశిధర్ ఆధ్వర్యంలో యూకే, ఐర్లాండ్, ఆస్ట్రేలియా, జర్మనీ, నెదర్లాండ్‌కు చెందిన ఎన్నారై జనసేన నేతలు పవన్‌ను కలిశారు.
జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు ఈ నెల 16నుంచి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. 16వ తేదీ ఉదయం సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాల ముఖ్యనేతలతో సమావేశమవుతారు.