Home / Jailer
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న చిత్రం జైలర్. నెల్సన్ రచన మరియు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో శాండల్ వుడ్ అగ్రనటుడు శివరాజ్ కుమార్ కూడ నటిస్తున్నారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ యువ దర్శకుడు నెల్సన్ కాంబోలో వస్తున్నచిత్రానికి జైలర్ అనే పేరు పెట్టారు. చాలా రోజుల క్రితమే అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాగా, ఈరోజు షూటింగ్ స్టార్ట్ అయింది. ఈ సందర్భంగా రజనీకాంత్ ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ ఈరోజు ఆవిష్కరించారు.